అన్ స్టాపబుల్ షోతో ఇమేజ్ మార్చుకున్న బాలయ్య..!

నందమూరి నట సింహం బాలకృష్ణ తన ఇమేజ్ మార్చుకునే పనిలో ఉన్నారా.

అదేంటి ఆయన ఈ టైం లో ఇమేజ్ మార్చుకోవడం ఏంటి ఫ్యాక్షన్ సినిమాలకు ఆయన పెట్టింది పేరు.

బాలయ్య బాబు తొడకొడితే బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే.మరి అలాంటిది బాలకృష్ణ ఎందుకు ఇమేజ్ చేంజ్ చేసుకోవాలని అనుకుంటారు అంటే.

మిగతా హీరోల్లో జనాల్లో ఎక్కువగా మింగిల్ అవలేరని బాలయ్య మీద ఒక టాక్ ఉండేది.అయితే ఆ ఇమేజ్ మార్చేందుకు అన్ స్టాపబుల్ షో సూపర్ గా పనిచేస్తుంది.

ఆహాలో వస్తున్న బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోతో తనలోని కామెడీ యాంగిల్ కూడా బయటకు తెస్తున్నారు.

Advertisement

బాలకృష్ణకు క్లోజ్ గా ఉండే వారు ఆయన మంచి మనసు గురించి చెబుతారు.కాని ఈ షో ద్వారా బాలయ్య బాబు పైకి గంభీరంగా కనిపిస్తారు కాని ఆయన మనసు ఇదా అనేలా ఇమేజ్ పూర్తిగా మారిపోయిందని చెప్పొచ్చు.ఆహా అన్ స్టాపబుల్ బాలయ్య షోలో మొదటి ఎపిసోడ్ మోహన్ బాబుతో చేయగా సెకండ్ ఎపిసోడ్ నానితో చేశారు.

ఇక ఈ షోలో విజయ్ దేవరకొండ కూడా సందడి చేస్తారని తెలుస్తుంది. ఏది ఏమైనా నందమూరి ఫ్యాన్స్ కు ఈ అన్ స్టాపబుల్ షో ఫుల్ ఎంటర్టైన్ చేస్తుందని చెప్పొచ్చు.

Advertisement

తాజా వార్తలు