టాలీవుడ్‌లో కొత్త వివాదానికి తెరలేపిన బాలయ్య

నందమూరి బాలకృష్ణ ఇండస్ట్రీ సీనియర్ హీరోల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకుని, ఇండస్ట్రీకి చెందిన నాలుగు స్తంభాల్లో ఒకరిగా నిలిచాడు.

కాగా ఇండస్ట్రీలో చోటు చేసుకుంటున్న కొన్ని సంఘటనలు ఆయన్ను బాగా బాధించినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావంతో సినిమా రంగానికి చెందిన అన్ని పనులు కూడా రద్దయిన సందర్భంలో పలువురు సినీ ప్రముఖులు ఈ విషయంపై పలుమార్లు చర్చించారు.కానీ ఏ ఒక్క సమావేశంలో కూడా నందమూరి బాలకృష్ణ కనిపించలేదు.

దీంతో నందమూరి హీరో ఈ సమావేశాలకు ఎందుకు దూరంగా ఉంటున్నాడని పలువురు సందేహం వ్యక్తం చేస్తున్నారు.కాగా నేడు నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా బాలయ్య ఈ విషయంపై పెదవివిప్పారు.

టాలీవుడ్‌లో చోటు చేసుకుంటున్న సమావాశేల గురించి ఆయనకు ఎలాంటి సమాచారం లేదని, ఆయన్ను ఎవరు పిలవలేదని చెప్పకొచ్చారు.ఇటీవల సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో పులువురు సినీ ప్రముఖులు చర్చలు జరిపినట్లు ఆయన వార్తల్లో చూసి తెలుసుకున్నానంటూ చెప్పుకొచ్చారు.

Advertisement

దీంతో బాలయ్యకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు సమావేశాలు నిర్వహిస్తే ఎలా? అంటూ పలువురు మండి పడుతున్నారు.ఇప్పటికే కరోనా రిలీఫ్ ఫండ్(CCC) కోసం బాలయ్య భారీ విరాళం అందించిన సంగతి తెలిసిందే.

అలాంటి వ్యక్తిని ఇలా సమావేశాలకు దూరం పెట్టడం ఏమిటని పలువురు విశ్లేషకులు మండి పడుతున్నారు.కాగా ఈ వివాదంపై ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ స్పందించారు.

కేసీఆర్‌తో జరిగిన మీటింగ్‌కు బాలకృష్ణను పిలవాల్సిన బాధ్యత ‘మా’ అసోసియేషన్ తీసుకోవాల్సింది.ఇక చిరంజీవి ఇంట్లో జరిగిన సమావేశానికి తలసాని అధ్యక్షత వహించారు.

ఇది ఆర్టిస్టుల సమావేశం కాదు కాబట్టి ఎవరూ ఎవరినీ పిలవాలని అనుకోలేదు.అవసరం ఉన్న వారిని తప్పకుంటా పిలుస్తామని, ఇండస్ట్రీలో ఎలాంటి గ్రూపులు లేవని, తామంతా ఒకటే అని సి.కళ్యాణ్ అన్నారు.మొత్తానికి బాలయ్య వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో విబేధాలు ఉన్నాయనే స్పష్టం చేస్తున్నాయి.

వీడియో వైరల్ : మూఢనమ్మకంతో చనిపోయిన వ్యక్తిని నీటిలో వేలాడదీసిన గ్రామ ప్రజలు.. చివరకు..?!
Advertisement

తాజా వార్తలు