Balakrishna: తన పిల్లల మీద బాలకృష్ణ కోపం ఎలా చూపిస్తాడో తెలుసా?

నందమూరి బాలకృష్ణ( Nandamuri Balakrishna ) గురించి పరిచయం అవసరమే లేదు కదా.ఈ వయస్సులో కూడా యంగ్ హీరోలకు పోటీగా సినిమాలు చేస్తున్నారు.

అఖండ, వీరసింహారెడ్డి సినిమాలతో వరుస బ్లాక్ బస్టర్ లు కొట్టారు.ఇక తరువాత సినిమా అనిల్ రావిపూడితో( Anil Ravipudi ) చేయగా ఈ సినిమా దసరా కానుకగా విడుదల కానుంది.

ఆ తరువాత కూడా వరుస సినిమాలతో బిజీ ఉన్నారు.ఆ తరువాత బాబీతో ఒక సినిమా చేయనున్నారు.

ఆ తరువాత అఖండ 2( Akhanda 2 ) కూడా ఉండే ఛాన్స్ ఉంది.ఇక సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ బాలకృష్ణ బిజీగా ఉన్నారు.

Advertisement

బాలకృష్ణ కోపం( Balakrishna Angry ) గురించి కూడా కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.స్టేజి మీద నుంచి ఫోన్ పడేయడం, చూపులతో భయపెట్టడం, ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్టు చెప్పేయడం బాలకృష్ణకు అలవాటే.

ఎవరైనా తప్పు చేస్తే సారీ చెప్పిస్తాడు.ఇక అందరికి ఇక్కడే ఒక ప్రశ్న వస్తుంది.

ఇంత బిజీగా, ఇంత కోపంగా ఉండే బాలకృష్ణ తన పిల్లల మీద కోపం వస్తే ఎం చేస్తాడు అని.ఈ విషయం చాలా మందికి తెలుసుకోవాలని ఉంటుంది.

బాలకృష్ణకి ముగ్గురు పిల్లలు.ఎవ్వరిని సినీ ఇండస్ట్రీలోకి పరిచయం చేయలేదు.కానీ మోక్షజ్ఞ( Nandamuri Mokshagna ) త్వరలోనే ఎంట్రీ ఇస్తారని సమాచారం.

రాజమౌళి వల్లే టాలీవుడ్ హీరోలకు ఈ స్థాయిలో గుర్తింపు.. నమ్మకపోయినా నిజమిదేనా?
రైతు పండుగ :నేడు రేవంత్ చెప్పనున్న ఆ రెండు శుభవార్తలు ఏంటి ? 

బాలకృష్ణ బయట ఎంత కోపంగా ఉంటారో ఇంట్లో కూడా అంతే కోపంగా, సీరియస్ గా ఉంటారట.తన బిడ్డలా విషయంలో బాలయ్య చాలా స్ట్రిక్ట్ గా ఉంటారట.

Advertisement

బాలకృష్ణ పెట్టిన రూల్స్ కచ్చితంగా పాటించాల్సిందే.బ్రాహ్మణి – తేజస్విని – మోక్షజ్ఞ ఏదైనా తప్పు చేస్తే ముందు సైలెంట్ గా కూర్చోబెట్టి మాట్లాడి ప్రాబ్లెమ్ సాల్వ్ చేస్తారంట.

రెండో సారి కూడా కొంచెం నెమ్మదిగా చెప్తారంట.కానీ మూడోసారి మాత్రం బాలయ్య సీరియస్ అవుతారట.ఎక్కడ బాలయ్య సీరియస్ అవుతారో అని మూడోసారి చెప్పేవరకు పిల్లలు తెచ్చుకోరు.

మొదటిసారి బాలకృష్ణ చెప్పగానే తరువాత బాలయ్యకి కోపం రాకుండా చూసుకుంటారట.ఇంత కోపంగా ఉండే బాలయ్య పిల్లలతో ఎలా ఉంటారనేది ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.

మొత్తానికి బాలయ్య ఇంట్లో కోపంగా ఉంటూనే కూల్ గా కూడా ఉంటారన్నమాట.

తాజా వార్తలు