అమెరికా అధ్యక్ష ఎన్నికలు : బైడెన్ - హారిస్ ప్రచార బృందంలో భారత సంతతి న్యాయవాదికి కీలక బాధ్యతలు

2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు జో బైడెన్, కమలహారిస్ ( Joe Biden, Kamala Harris )అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.దీనిలో భాగంగా ఇప్పటికే బైడెన్-హారిస్ టీమ్ ప్రచారాన్ని, నిధుల సేకరణను ప్రారంభించింది.

 Indian-american Lawyer Varoon Modak Named Ballot Access Counsel In Biden-harris-TeluguStop.com

ఈసారి కూడా బైడెన్, హారిస్‌లను గెలిపించేందుకు పలువురు భారతీయులు రంగంలోకి దిగారు.అలాగే ఇటీవల డెమొక్రాటిక్ పార్టీకి రుణదాతలుగా వున్న 150 మందితో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు బైడెన్.

ఈ నేపథ్యంలో ఇండో అమెరికన్ లాయర్ వరూన్ మోదక్‌కు( Lawyer Varun Modak ) .బైడెన్ – హారిస్ ఎన్నికల బృందంలో కీలక బాధ్యతలు దక్కాయి.ఆయనను బ్యాలెట్ యాక్సెస్ నిమిత్తం సీనియర్ న్యాయవాదిగా ఎంపిక చేశారు.

Telugu Georgetown, Indianamerican, Joe Biden, Kamala Harris, Varoon Modak, Washi

ఈ హోదాలో ఆయన అమెరికాలోని 57 రాష్ట్రాలు, భూభాగాల్లో జోబైడెన్ స్థానాన్ని సుస్ధిరం చేసేందుకు ప్రచార యత్నాలను పర్యవేక్షిస్తారు.అలాగే ప్రచార ప్రతినిధుల ఎంపిక ప్రక్రియకు కూడా మోదక్ నాయకత్వం వహిస్తారు.ప్రస్తుతం ఎలియాస్ లా గ్రూప్ పొలిటికల్ లా ప్రాక్టీస్‌లో న్యాయవాదిగా పనిచేస్తున్నా వరూన్ .బ్యాలెట్ యాక్సెస్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నఅలనా మౌన్స్‌తో కలిసి విధులు నిర్వర్తిస్తారని ఎరీ కౌంటీ డెమొక్రాటిక్ పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది.

Telugu Georgetown, Indianamerican, Joe Biden, Kamala Harris, Varoon Modak, Washi

బైడెన్- హారిస్ మద్ధతుదారులను ప్రచారంలో నిమగ్నం చేయడానికి, వినూత్న మార్గాలను కనుగొనడంలోనూ వరూన్ బాధ్యత వహిస్తారు.అలనా, వరూన్‌లు అసాధారణ ప్రతిభావంతులని , ఈ సమస్యపై వారికి అపారమైన అనుభవం వుందని పార్టీ తెలిపింది.ఎలియాస్ లా గ్రూప్‌లో న్యాయవాదిగా ఆయన ఫెడరల్ అభ్యర్ధులు, పార్టీ కమిటీలు, రాజకీయ కార్యాచరణ కమిటీలకు బ్యాలెట్ యాక్సెస్, ప్రచార ఆర్ధిక సమస్యలపై సలహా ఇచ్చారు.

ఎలియాస్ లా గ్రూప్‌లో చేరడానికి ముందు మోదక్ అనేక రాజకీయ న్యాయ సంస్థలలో అటార్నీగా పనిచేశారు.కాలిఫోర్నియాకు చెందిన వరూన్ మోదక్ బర్కిలీలోని కాలిఫోర్నియా యూనివర్సిటీ నుంచి బీఏ, జార్జ్‌టౌన్ యూనివర్సిటీ లా సెంటర్ నుంచి జేడీ పట్టా అందుకున్నారు.

వాషింగ్టన్ డీసీలో స్థిరపడిన మోదక్.కాలిఫోర్నియా పొలిటికల్ అటార్సీన్ అసోసియేషన్‌లో సభ్యుడు కూడా.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube