Balakrishna Adivi Shesh : మిమ్మల్ని ఈ షోకు పిలవకుండా ఉండాల్సింది.. శర్వానంద్, అడివి శేష్ పై బాలయ్య కామెంట్స్?

టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

బాలయ్య బాబు ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు అన్‌స్టాపబుల్‌ సీసన్ 2 కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు.

కాగా ఈ అన్‌స్టాపబుల్‌ షోకి ప్రేక్షకుల నుంచి భారీగా ప్రేక్షకాదరణ లభిస్తోంది.అంతేకాకుండా ఈ షో రికార్డు స్థాయిలో వ్యూస్ ని దక్కించుకుంటూ దూసుకుపోతోంది.

బాలయ్య బాబు తన ఎనర్జీతో ఈ షోకి మరింత క్రేజ్ ని తీసుకొచ్చారు.ఈ వయసులో కూడా అంతే ఎనర్జిటిక్ గా మాట్లాడుతూ షోలకు వచ్చే వారిపై పంచులు వేస్తూ అందరిని కడుపుబ్బ నవ్విస్తున్నాడు.

కాగా తాజాగా అన్‌స్టాపబుల్‌ మూడవ ఎపిసోడ్ కి హీరో అడవి శేషు శర్వానంద్ లు హాజరయ్యారు.కాగా తాజాగా వదిలిన ప్రోమో చూస్తే ఈ ఎపిసోడ్ మొత్తం సరదా సరదాగా సాగినట్టు తెలుస్తోంది.

Advertisement

హీరో బాలకృష్ణ షో మధ్యలో ఈ ఇద్దరు హీరోల పై కామెంట్ ల వర్షం కూడా కురిపించారు.శర్వానంద్ అడవి శేష్ డైలాగులకు బాలయ్య బాబు మీ వన్నీ కూడా బి సెంటర్ మాటలు అంటూ పంచులు వేశాడు.

అంతేకాకుండా మీలాంటి వారిని పిలవడమే తప్పు అని కూడా అన్నారు బాలయ్య బాబు.ఆ ఇద్దరి యంగ్ హీరోల అనుభవాలను పంచుకోమని చెప్పగా యాక్టింగ్ స్కిల్స్ ను బట్టి హీరోలకు రేటింగ్ ఇవ్వాలని చెప్పారు బాలకృష్ణ.

అప్పుడు బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జున,వెంకటేష్ పేర్లు చెప్పగా వెంటనే బాలకృష్ణ అని సమాధానం చెబుతూనే ఆ ఇద్దరు హీరోలు తలలు పట్టుకొని మహాప్రభు అని ఆ ప్రశ్నలు దాటి వేసే ప్రయత్నం చేశారు.

ఆ తర్వాత బాలకృష్ణ సినిమాలలో ఎవరెవరికి ముద్దు పెట్టావు.? ఏ హీరోయిన్ కి ముద్దు పెట్టాలి అనుకుంటున్నావు అని ప్రశ్నించగా.అడవి శేష్ స్పందిస్తూ మొదట అదా శర్మకు ముద్దు పెట్టాను.

సమంత నాగచైతన్య విడాకులకు పిల్లలే కారణమా.. అసలు విషయం బయటపెట్టిన చైతన్య?
రహస్యంగా పెళ్లి చేసుకున్న టాలీవుడ్ స్టార్ సింగర్లు.. ఈ జోడి క్యూట్ కపుల్ అంటూ?

ఆ తర్వాత మీనాక్షి చౌదరి కి ముద్దు పెట్టాను.ఎప్పటికైనా కత్రినా కైఫ్ ను ముద్దు పెట్టుకోవాలని ఉంది అని తెలిపారు అడవి శేష్.

Advertisement

తర్వాత బాలకృష్ణ నీ ఫోన్‌లో ఆ వీడియోలు ఎన్ని ఉన్నాయ్‌? అని శర్వానంద్‌ ని అడగగా సర్‌.మీ నాన్నగారి దగ్గర మా తాత అకౌంటెంట్‌గా పనిచేశారు.

మీకు సంబంధించిన చాలా విషయాలు మా దగ్గరున్నాయి.ఇప్పుడు చెప్పమంటారా అన్ని శర్వానంద్‌ అనడంతో వెంటనే బాలకృష్ణ మీలాంటి వారిని షోకు పిలవడమే తప్పు అంటూ బాలకృష్ణ నవ్వులు పూయించారు.

తాజా వార్తలు