బక్రీద్ పండుగ రోజు సమాధి దగ్గర అలా ఎందుకు చేస్తారో తెలుసా?

ప్రపంచవ్యాప్తంగా ముస్లిం మతస్థులు ఎంతో ఘనంగా జరుపుకొనే అతి పెద్ద పండుగలో బక్రీద్ ఒకటి.

ప్రతి ఏడు బక్రీద్ పండుగను ఇస్లామిక్ పవిత్ర తీర్థయాత్ర లేదా హజ్ నెల చివరిలో జరుపుకుంటారు.

బక్రీద్ అంటే త్యాగానికి ప్రతీక.ఈ పండుగ రోజు ముస్లిం మతస్తులు మేకను లేదా గొర్రెను బలి ఇచ్చి దానధర్మాలు చేస్తారు.

ఆ దేవుడి ఆజ్ఞ మేరకే ఈ విధమైనటువంటి దానాలను నిర్వహిస్తారని చెప్పవచ్చు.ముస్లిం మతస్తులు ఎంతో పరమ పవిత్రంగా భావించే ఈ బక్రీద్ పండుగను ఈ ఏడాది జూలై 21 బుధవారం ప్రపంచవ్యాప్తంగా జరుపుకోనున్నారు.

బక్రీద్ పండుగ రోజు కొత్త బట్టలను ధరించి మసీదుకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు.అదేవిధంగా ఈ పండుగ రోజు బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు కలిసి ఒకరికొకరు కానుకలను ఇచ్చిపుచ్చుకుంటూ పండుగ శుభాకాంక్షలను తెలుపుకుంటారు.

Advertisement
Bakrid Festival Reality And Speciality In Telugu Facts, Bakrid Festival Reality

మసీదుకు వెళ్లి ప్రార్థనలు చేసిన తర్వాత ఎవరి సామర్థ్యం కొద్దీ వారు పేదలకు దానధర్మాలు చేస్తారు.ఈ విధంగా దానం చేయడమే ఈ పండుగ ప్రత్యేకత.

ఎంతో పవిత్రంగా జరుపుకునే ఈ పండుగ రోజు ముస్లిం మతస్తులు వారి కుటుంబంలో మరణించిన వారి సమాధులను సందర్శించి అక్కడ కూడా ప్రత్యేకమైన ప్రార్థనలను నిర్వహిస్తారు.

Bakrid Festival Reality And Speciality In Telugu Facts, Bakrid Festival Reality

చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు కొత్త బట్టలు,వారికి ఇష్టమైన వివిధ రకాల ఆహార పదార్థాలను తయారు చేసుకొని సమాధి వద్దకు వెళ్లి అక్కడ అవన్నీ సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు.ఈ విధంగా చేయడం వల్ల మరణించిన వారి ఆత్మకు శాంతి కలిగి వారు సంతోష పడతారని భావిస్తారు.ఈ పండుగ రోజు ముస్లిం మతస్తులకు హజరత్ ఇబ్రహీం ప్రాణ త్యాగానికి గుర్తు చేసుకుంటూ మేకను బలి దానం చేసి పేదలకు దానధర్మాలు చేయడం ఆనవాయితీగా వస్తోంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగష్టు 16, సోమవారం, 2021
Advertisement

తాజా వార్తలు