దేవాలయం లో బూతులు

చట్ట సభల్ని దేవాలయాలతో పోల్చుతాం.వాటి పవిత్రత అలాంటిది.

పవిత్రమైన దేవాలయంలోకి వచ్చే ప్రజా ప్రతినిథులు, తమ స్థాయిని మర్చిపోయి, దేవాలయాల పవిత్రతను చెడగొడ్తున్న సందర్భాలు అనేకం.

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో జరుగుతున్న పరిణామాలు అత్యంత జుగుప్సాకరంగా వున్నాయన్నది కాదనలేని వాస్తవం.

ఇదిప్పుడే కొత్తగా చూస్తున్నదేం కాదుగానీ, ఇటీవలి కాలంలో పరిస్థితులు మరింత దిగజారిపోతున్నాయి.తెలంగాణ అసెంబ్లీలో అధికార పార్టీకి చెందిన వ్యక్తి ఒకరు హద్దులు దాటారు.

ఆయనగారు సాక్షాత్తూ మంత్రి కూడా.ఈ పరిణామంపై ముఖ్యమంత్రి సీరియస్‌గా స్పందించారు.

Advertisement

సదరు మంత్రితో క్షమాపణ చెప్పించారు.మరి, ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో జరుగుతున్నదేమిటి.? వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా జుగుప్సాకరంగా వ్యవహరించారన్నది ఆరోపణ.ఆ ఆరోపణలకు సంబంధించిన వీడియో ఫుటేజీలు కూడా బయటకొచ్చాయి.

ఆమెపై సస్పెన్షన్‌ వేటు కూడా వేశారు.కానీ, అదే తరహా వేటు.

ఆమెకన్నా దారుణంగా వ్యవహరించిన అధికార పార్టీ నేతలపై ఎందుకు పడలేదు.? ఇదే ఇప్పుడు మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మారింది.టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అసెంబ్లీ సాక్షిగా, ఏంట్రారేయ్‌.

నా కొడకా.పాతేస్తా.

హెచ్‎సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు క్లోజ్..!
పోలియోతో రెండు కాళ్లు పడిపోయినా రోజుకు 16 గంటల పని.. వైతీశ్వరన్ సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

అంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేని ఉద్దేశించి బూతుల దండకం అందుకున్నారు.కానీ, ఆయనపై చర్యల్లేవు.

Advertisement

తాజాగా ఈ రోజు అసెంబ్లీలో, రోజా వ్యవహారంపై చర్చ జరిగితే, ఆ చర్చలో చట్ట సభల్ని దేవాలయంగా అభివర్ణించారు బొండా ఉమామహేశ్వరరావు.ఇంతకన్నా కామెడీ ఇంకేమన్నా వుందా.? .

తాజా వార్తలు