చివరి మజిలీకి చేరిన బాబు కేసు!

స్కిల్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రతిపక్ష నేత చంద్రబాబుకి( Chandrababu ) దిగువ కోర్ట్ లతో పాటు హై కోర్టు లో కూడా చుక్కెదురైంది .

హైకోర్టులో క్వాష్ పిటిషన్ కొట్టి వేయడంతో చంద్రబాబు లీగల్ టీం అత్యున్నత న్యాయస్థానం తలుపుతట్టింది.

హైకోర్టులో క్వాష్ పిటిషన్ క్యాన్సిల్ చేయడానికి హైకోర్టు చెప్పిన కారణాలు ఏమిటంటే అత్యంత అరుదైన కేసులలో మాత్రమే విచారణను కోర్టులు అడ్డుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పినందున విచారణ సంస్థల యొక్క చట్టబద్ధమైన హక్కును గౌరవిస్తూ క్వాష్ పిటిషన్ కొట్టి వేస్తున్నట్టుగా హైకోర్టు ప్రకటించింది.చంద్రబాబు న్యాయవాదులు వాదిస్తున్న ప్రకారం గవర్నర్ అనుమతికావాలి అనే అంశాన్ని హైకోర్టు అంగీకరించలేదు.

అంతేకాకుండా ఎఫ్ఐఆర్ లో చంద్రబాబు పేరు లేదన్న విషయాన్ని కూడా హైకోర్టు పరిగణలోకి తీసుకున్నట్లుగా కనిపించలేదు.ఎఫ్ ఐ ఆర్ నమోదు అన్నది ఎన్ సైక్లో పీడియా( Encyclopaedia ) కాదని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన వాదనలను హైకోర్టు ఉటంకించింది.

దాంతో చంద్రబాబుపై ఇటీవల సిబిఐ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధించినట్లయ్యింది .దాంతో ఇక బాబు కేసు చివర మజిలీకి చేరుకున్నట్లు అయింది.మరి సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పుతో ఏకీభవిస్తే బాబు బృందానికి కష్టాలు తప్పకపోవచ్చు.

Advertisement

అయితే తమ వాదనలో న్యాయం ఉందని ముఖ్యమంత్రి హోదాలో తీసుకున్న నిర్ణయాలపై చంద్రబాబు విచారణకు అర్హుడు కాదని టిడిపి లాయర్ల బంధం గట్టిగానే విశ్వ శిస్తునట్టుగా తెలుస్తుంది .దాంతో కచ్చితంగా అత్యున్నత న్యాయస్థానంలో తమకు రిలీఫ్ దొరుకుతుందని తెలుగుదేశం పార్టీ( Telugu Desam Party ) భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.అయితే సిఐడి బలంగా ప్రాథమిక ఆధారాలు చూపిస్తున్న ఈ కేసులో సుప్రీంకోర్టు ఈ దశలో కలగజేసుకుంటుందా ? అన్నది అనుమానమే అని న్యాయనిపుణులు వాఖ్యనిస్తున్నారు .కనీస ఆధారాలు చూపించగలిగితే కేసును కొట్టివేయడానికి సహజంగా కోర్టులు ఇష్టపడవని ,కేవలం దురుద్దేశపూర్వకంగా ఆరోపణలు చేయబడ్డాయి అని సుప్రీంకోర్టును నమ్మించగలిగితేనే బాబు బృందానికి రిలీఫ్ దొరుకుతుందని తెలుస్తుంది.మరి దేశపు అత్యున్నత న్యాయస్థానం అయినా బాబుకి స్వాంతన ఇస్తుందో లేదో చూడాలి .

లక్కీ భాస్కర్ : భిన్నమైన కథే కానీ, అందరి బుర్రకెక్కుతుందో లేదో చూడాలి!
Advertisement

తాజా వార్తలు