అయోధ్య: మోడీ, అమిత్‌ షాలకు ఎన్ని హ్యాట్సాప్‌లు చెప్పినా సరిపోవు

దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ దేశాలు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన అయోధ్య భూ వివాదం కేసులో సుప్రీం కోర్టు నేడు తన తీర్పును ఇవ్వడం జరిగింది.

సుప్రీం కోర్టు తీర్పు వచ్చిన తర్వాత దేశంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూశారు.

అంతర్జాతీయ మీడియా సంస్థలు కూడా భారత దేశంలో ఏదో అలజడి జరిగే అవకాశం ఉంది అంటూ ప్రత్యేక ఫోకస్‌ పెట్టాయంటూ ప్రచారం జరిగింది.కాని అనూహ్యంగా అయోధ్య కేసు విషయంలో భారత దేశంలో ఎలాంటి హింస చోటు చేసుకోక పోవడంతో పాటు అంతా ప్రశాంతంగా ఉంది.

ప్రధాని నరేంద్ర మోడీ మరియు హోం మంత్రి అమిత్‌ షాలు అన్ని జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు పక్కా ప్రణాళికతో అడుగులు వేయడం వల్ల ఎక్కడ ఎలాంటి గొడవలు జరగలేదు.ముందస్తు ప్రణాళిక కారణంగానే ఎలాంటి అలజడి జరగలేదు.

గత రెండు వారాలుగా ఉత్తర భారతదేశంలో సున్నిత ప్రాంతాల్లో భారీ సెక్యూరిటీని ఏర్పాటు చేయడంతో పాటు, వివాదాస్పదం అయ్యే వారిని, అల్లరి మూకలను గృహ నిర్భందం చేశారు.వందలాది కాలేజ్‌లు మరియు స్కూల్స్‌లో వేలాది మందిని ఉంచినట్లుగా సమాచారం అందుతోంది.

Advertisement

అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాతే తీర్పు వచ్చేలా మోడీ మరియు అమిత్‌ షాలు ప్లాన్‌ చేశారు.మొత్తానికి ఇంత సున్నితమైన కేసు విషయంలో అంత ప్రముఖ తీర్పు వచ్చినా కూడా దేశం మొత్తం ప్రశాంతంగా ఉంది అంటే అది మోదీ మరియు అమిత్‌ షాల వల్లే అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

రాజధానిపై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు..!!
Advertisement

తాజా వార్తలు