అవకాడోతో ఇలా చేస్తే ఒత్తైనా, మెరిసే జుట్టు మీ సొంతం!

అవకాడో.ఆరోగ్యానికి అనేక ప్ర‌యోజ‌నాల‌ను అందించే పండ్ల‌లో ఇది ఒక‌టి.

అవ‌కాడో పండులో మెగ్నీషియం, కాపర్‌, పొటాషియం, ఫాస్ఫరస్‌, ఐర‌న్‌, విట‌మిన్ ఎ, విట‌మిన్ బి, విట‌మిన్ సి, విట‌మిన్ ఇ, విట‌మిన్ కె, ఫోలిక్ యాసడ్‌, ఫైబ‌ర్‌, ప్రోటీన్‌, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా ఎన్నో పోషక విలువ‌ల దాగి ఉంటాయి.అందుకే అవ‌కాడో పండు తీసుకుంటే హెల్త్‌కు మంచిద‌ని ఆరోగ్య నిపుణులు చెబుతారు.

అయితే ఆరోగ్యానికే కాదు.కేశాల‌కు కూడా అవ‌కాడో పండు ఎంతో మేలు చేస్తుంది.

ముఖ్యంగా ఒత్తైనా, మెరిసేటి జుట్టును అందించ‌డంలో అవ‌కాడో పండు గ్రేట్‌గా స‌హాయ‌ప‌డుతుంది.మ‌రి అవ‌కాడో పండును కేశాల‌కు ఎలా ఉప‌యోగించాలి అన్న‌ది ఆల‌స్యం చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

ముందుగా అవ‌కాడో పండును మెత్త‌గా పేస్ట్ చేసి.అందులో ఆలివ్ ఆయిల్ వేసి మిక్స్ చేసుకోవాలి.

ఈ మిశ్ర‌మాన్ని త‌ల‌కు, జుట్టుకు మ‌రియు కుదుళ్ల‌కు ప‌ట్టించి.ఒక గంట త‌ర్వాత త‌ల‌స్నానం చేయాలి.

ఇలా వారంలో రెండు సార్లు చేస్తే హెయిర్ ఫాల్ త‌గ్గి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.అలాగే అవ‌కాడో పండులో మెత్త‌గా పేస్ట్ చేసి.

అందులో ఎగ్ వైట్ మ‌రియు కొబ్బ‌రి నూనె వేసి క‌లుపుకోవాలి.ఆ త‌ర్వాత ఈ మిశ్ర‌మాన్ని త‌ల‌కు, కేశాలకు అప్లై చేసి.

కమల్ హాసన్ భారతీయుడు 3 తో మరోసారి నట విశ్వరూపాన్ని చూపించబోతున్నాడా..?
కీర్తి సురేష్ పెళ్లి చీర కోసం అన్ని గంటలు కష్టపడ్డారా.. ఆ చీర ప్రత్యేకత ఏంటో తెలుసా?

గంట పాటు వ‌దిలేయాలి.అనంత‌రం గోరు వెచ్చ‌ని నీటితో హెడ్ బాత్ చేయాలి.

Advertisement

ఇలా నాలుగు రోజుల‌కు ఒక సారి చేస్తే.జుట్టుకు పోష‌ణ అంది ఒత్తుగా పెరుగుతుంది.

మ‌రియు సిల్కీగా మెరుస్తుంది.ఇక అవ‌కాడో పండు పేస్ట్‌లో కొద్దిగా పెరుగు మ‌రియు నిమ్మ ర‌సం వేసి క‌లుపు కోవాలి.ఈ మిశ్ర‌మాన్ని త‌లకు, జుట్టుకు అప్లై చేసి.

అర గంట లేదు గంట పాటు డ్రై అవ్వ‌నివ్వాలి.ఆ త‌ర్వాత సాధార‌ణ షాంపూతో త‌ల‌స్నానం చేయాలి.

ఇలా చేస్తే చండ్రు త‌గ్గి.జుట్టు పొడ‌వుగా, ఒత్తుగా పెరుగుతుంది.

తాజా వార్తలు