పెళ్లికి ముందే కాబోయే భార్యకు ముద్దు పెట్టిన ముక్కు అవినాష్.. వైరల్ వీడియో

జబర్దస్త్ కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ముక్కు అవినాష్ గురించి అందరికీ తెలిసిందే.జబర్దస్త్ లో తన కామెడీతో ఎంతమంది ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.

కెరీర్ మొదట్లో మిమిక్రీ ఆర్టిస్ట్ గా పనిచేసిన అవినాష్ ఆ తర్వాత జబర్దస్త్ లో కమెడియన్ గా అడుగు పెట్టాడు.ఇక బిగ్ బాస్ కోసం జబర్దస్త్ ని వదిలి పెట్టగా ప్రస్తుతం పలు షో లలో బాగా బిజీగా ఉన్నాడు.

ఇదిలా ఉంటే పెళ్లికి ముందే తన కాబోయే భార్య కి ముద్దు పెట్టాడు.ఇటీవలే అవినాష్ కు అనూజ అనే అమ్మాయితో ఎంగేజ్మెంట్ జరిగిన సంగతి తెలిసిందే.

ఇక ఈయన ఓ ఇంటివాడు కాబోతున్న సందర్భంగా బుల్లితెర సెలబ్రెటీలు, ఆయన అభిమానులు తనకు శుభాకాంక్షలు తెలిపారు.ఇక వాటికి సంబంధించిన ఫోటోలను కూడా అవినాష్ తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు.

Advertisement

ఇదిలా ఉంటే తాజాగా మరో వీడియోను సోషల్ మీడియా వేదికగా అభిమానులకు పంచుకున్నాడు.

ఇక ఆ వీడియోలో అవినాష్ కుటుంబ సభ్యులందరూ ఉన్నారు.అనూజతో పక్కన కూర్చుని సరదాగా మాట్లాడటం.పూలు పండ్లు మార్చుకున్న తర్వాత వీరిద్దరు కలిసి ఫోటోలు దిగడం వంటివి ఆ వీడియోలో ఉన్నాయి.

అంతేకాకుండా తన కాబోయే భార్యకు పెళ్లికి ముందే రొమాంటిక్ గా ఒక ముద్దు కూడా పెట్టి డాన్స్ కూడా చేశాడు అవినాష్.

ఇక తన సోదరుడు కూడా మధ్యలో మాట్లాడుతూ మొత్తానికి ఎన్నో ఏళ్లకు తన అన్నయ్యకు అమ్మాయి దొరికిందని పెళ్లి చేసుకోబోతున్నాడని కొన్ని కామెంట్లు చేశాడు.ఇక పెళ్లి డేట్ ఫిక్స్ కాలేదు అని పెళ్లి డేట్ ఫిక్స్ అయిన వెంటనే అందరికీ షేర్ చేస్తానని తెలిపాడు.అంతేకాకుండా ఎంగేజ్మెంట్ అనుకోకుండా జరిగిందని ఎవర్ని పిలవలేదని పెళ్లికి అందర్నీ పిలుస్తాను అని తెలిపాడు అవినాష్.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారగా అవినాష్ అభిమానులు తెగ లైకులు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు