నిన్నటి దాకా కార్చిచ్చు: ఇప్పుడు వరదలు, తుఫాన్లతో ఆస్ట్రేలియన్ల పోరాటం

ఆస్ట్రేలియాపై ప్రకృతి పగపట్టినట్లుంది.గతంలో ఎన్నడూ కనీవినీ ఎరుగని వరుస విపత్తులను దేశం ఎదుర్కొంటోంది.

పచ్చటి అడవుల్ని కొద్దిరోజుల క్రితం కార్చిచ్చు దహించి వేసింది.ఈ విధ్వంసంలో వందల మంది మరణించగా.

లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు.ఇక మూగ జీవాల సంగతి సరేసరి.

దాదాపు 50 కోట్ల జంతువులు దావాగ్నిలో కాలి బూడిదైనట్లు అనధికారిక గణాంకాలు చెప్పాయి.ఈ విపత్తు నుంచి కోలుకోవడానికి ఆస్ట్రేలియాకు కొన్ని సంవత్సరాలు పడుతుందని విశ్లేషకుల అంచనా.

Advertisement

ఇప్పుడిప్పుడే దీని నుంచి బయటపడుతున్న ఆస్ట్రేలియన్లను వరుస ప్రకృతి విపరీత్తులు వణికిస్తున్నాయి.తాజాగా పశ్చిమ ఆస్ట్రేలియాలోని కొన్ని ప్రాంతాలలో ఆదివారం బుష్‌ఫైర్ సంభవించింది.

అలాగే ఇతర ప్రాంతాల్లో శక్తివంతమైన తుఫాన్లు, తూర్పు తీరంలో భారీ వరదలు సంభవించాయి.కార్చిచ్చు కారణంగా హెక్టార్ల కొద్ది అడవి నాశనమవ్వడంతో దేశంలో వాతావరణం దెబ్బతింది.

అదే సమయంలో భారీ వర్షాలు, వడగళ్లు, తుఫానులు, వేడి గాలులు విరుచుకుపడుతున్నాయి.

శనివారం మధ్యాహ్నం సంభవించిన ఉష్ణమండల తుఫాను డేమియన్ కారణంగా ఆదివారం దేశంలోని ఎగువ రాష్ట్రాల్లో గంటకు 200 కిలోమీటర్ల వేగంతో గాలులతో భారీ వర్షాలు కురిశాయి.దీని కారణంగా సిడ్నీ, న్యూసౌత్ వేల్స్ రాష్ట్రంలో భారీ వరదలు సంభవించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.1998 తర్వాత వరుసగా మూడు రోజుల పాటు ఎడతెరిపి లేకుండా వర్షం కురవడం ఇదే తొలిసారి.నిరంతర కరువు కారణంగా నీటి మట్టాలు తక్కువగా ఉన్నందున నదులకు వరదల ముప్పు తక్కువగా ఉన్నప్పటికీ.

హెచ్‎సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు క్లోజ్..!
వలసదారులకు షాక్ : గ్రీన్ కార్డ్‌ దరఖాస్తులను నిలిపివేసిన అమెజాన్, గూగుల్

భారీ వర్షం కారణంగా తీర ప్రాంతం కోతకు గురయ్యే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు