ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠంపై ఇటీవలే కూర్చున్న ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ త్వరలో షాక్ తగులనున్నట్లుగా తెలుస్తోంది.ఆప్ సీనియర్ నేతల్లో కొందరు అరవింద్ కేజ్రీవాల్ రెండు పదవుల్లో ఉండటాన్ని తప్పుబడుతున్నారు.
ముఖ్యమంత్రిగా ఉన్న కేజ్రీవాల్ పార్టీ కన్వీనర్ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.కేజ్రీవాల్ రాజీనామా చేయని పక్షంలో పార్టీ ముఖ్య నేతలు సమావేశం అయ్యి, ఆయన్ను తప్పించే అవకాశాలున్నాయని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
అయితే రాజీనామ చేయడం కేజ్రీవాల్‌కు ఇష్టం లేదని ఆయన సన్నిహితుల ద్వారా తెలుస్తోంది.
ఈనెల 4న ఆప్ జాతీయ స్థాయి కార్యవర్గ సమావేశం జరుగనుంది.
ఆ సమావేశంలో ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి.ఆప్ కన్వీనర్ పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేస్తే ఆయన సన్నిహితులకు ఎవరికైనా ఆ పదవి దక్కేలా చేసే అవకాశాలున్నాయి.
ఆప్ జాతీయ కన్వీనర్ పదవికి పార్టీలో పలువురు సీనియర్ నేతలు కూడా ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.అధికార పార్టీ కావడంతో అన్ని అవకాశాలుంటాయనే ఉద్దేశ్యంతో పార్టీ పదవి కోసం నేతలు ప్రాకులాడుతున్నారు.
మరి ఎల్లుండి జరుగబోతున్న మీటింగ్‌లో ఏ నిర్ణయం వెలువడుతుందో చూడాలి.