తెలుగుదేశం పార్టీని ఏపీలో దెబ్బతీయడమే ఏకైక లక్ష్యంగా వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ పెట్టుకున్నట్లుగా కనిపిస్తున్నారు.అందుకే ఆ పార్టీలో గత కొంత కాలంగా అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
టీడీపీ కీలక నాయకుల అవినీతి వ్యవహారాలు , లొసుగులు అన్నిటినీ కనిపెట్టి, పక్క ఆధారాలతో ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.అయితే ఇదంతా టీడీపీని బలహీన చేసేందుకు మాత్రమే కాకుండా, ఆ పార్టీలోని కింది స్థాయి నాయకులకు పార్టీ భవిష్యత్తుపై ఆందోళన రేకెత్తించే ఏకైక లక్ష్యంగా వైసీపీ ముందుకు వెళ్తున్నట్లు కనిపిస్తోంది.
టీడీపీలో ప్రధాన నాయకులుగా చలామణి అవుతున్న వారందరూ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.అవినీతి కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్నారు.
మానసికంగా మరెంతో మంది ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు.

ఈ భయంతోనే చాలామంది నాయకులు ఇప్పుడు వైసీపీలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారట.అసలు వైసీపీ లక్ష్యం కూడా ఇదేనట.టిడిపిలో కీలకంగా ఉన్న నాయకులందరిని వైసీపీ లో చేరే విధంగా రకరకాల మార్గాల ద్వారా ఒత్తిడి చేస్తున్నట్టు తెలుస్తోంది.
టిడిపికి చెందిన మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు , నియోజకవర్గ స్థాయి నాయకులు ఇలా చాలా మంది వైసీపీ తీర్థం కూర్చునేందుకు రెడీ అయిపోయారట.వైసిపి ఒత్తిడితో పాటు, చంద్రబాబు వయసురీత్యా యాక్టివ్ గా ఉండలేకపోవడం, లోకేష్ రాజకీయ శక్తి సామర్థ్యాలపై పార్టీలో అందరికీ అనుమానాలు ఉండడం , ఇలా ఎన్నెన్నో కారణాలతో పార్టీ మారేందుకు సిద్ధం అవుతున్నారట.
ప్రస్తుతం ఉత్తరాంధ్ర జిల్లాల పై వైసిపి ఫుల్ ఫోకస్ పెట్టింది.
ముఖ్యంగా విశాఖ జిల్లాలో పెద్దఎత్తున టీడీపీ నాయకులను వైసీపీలో చేర్చే బాధ్యతను ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తీసుకున్నారట.
దీనిలో భాగంగా కొంతమంది మాజీ ఎమ్మెల్యేలతో, పాటు ఓ ఎమ్మెల్సీ వైసీపీలో అతి తొందరలోనే చేరబోతున్నట్టు సమాచారం.ఈ పరిణామాల పై ఇప్పుడు టీడీపీ లో ఎక్కడా లేని ఆందోళన కనిపిస్తోంది.
<