కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అత్యంత బలమైన పార్టీ అన్న విషయం తెలిసిందే.ప్రస్తుతం రేవంత్ రెడ్డి ఇక సీనియర్ లు కలిసి రాకున్నా తనదైన శైలిలో వ్యూహాలు రచిస్తూ బలమైన కార్యాచరణను అమలు చేస్తూ కాంగ్రెస్ పార్టీని క్షేత్ర స్థాయిలో బలపరిచేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది.
అయితే ఒకప్పుడు చాలా మంది సీనియర్ లు కలిసి రాకపోవడం ఉన్నా కాని అందులో కొంత మంది సీనియర్ లు రేవంత్ రెడ్డి హాజరవుతున్న సమావేశాలకు హాజరవుతూ ఉన్నారు.దీంతో ఇక కొంత మంది సీనియర్ నేతలు సహకరిస్తున్న పరిస్థితి ఉండడంతో ఇక రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై ఇంకాస్త పట్టు సాధిస్తున్నారన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.
అయితే కొంత సీనియర్ లు సహకరించడానికి కారణం తాజాగా రేవంత్ చేసిన వ్యాఖ్యలే కారణమని తెలుస్తోంది.
పార్టీ సమావేశాలకు హాజరుకాని నాయకులు పదవులు దక్కవని ఇక ఆ నాయకులు పార్టీ పదవులపై అశలు పెట్టుకోవద్దని చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ లో కాస్త కదలిక తీసుకొచ్చాయనే చర్చ నడుస్తోంది.
అయితే రేవంత్ మాత్రం తనకు అడ్డుపడుతున్న కాంగ్రెస్ నేతలను గుర్తుపెట్టుకొని రానున్న రోజుల్లో సరైన సమయంలో వారికి ఝలక్ ఇచ్చే అవకాశాలు కూడా లేకపోలేదన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.అయితే రేవంత్ రెడ్డి మాత్రం ఎక్కడా తగ్గేది లేదన్నట్లుగా వ్యవహరిస్తూ తనదైన శైలిలో వ్యూహాలను అమలుచేస్తున్న పరిస్థితి ఉంది.
అయితే రాను రాను రేవంత్ తో పాటు సీనియర్ లు నడిస్తే కాంగ్రెస్ మరింత పుంజుకునే అవకాశం ఉంటుంది.తద్వారా బీజేపీని నిలువరించేందుకు కాంగ్రెస్ కు అదనపు బలం అనేది దొరుకుతుంది.
అయితే ఎన్నికల సమయంలో వాతావరణం అనేది చాలా ప్రత్యేకంగా ఉంటుందనేది మనకు తెలిసిందే.