తోటి విద్యార్థి పై దారుణం.. ఆ విషయం బయట పడుతుందనే భయంతో..!

సౌత్ ఈస్ట్ ఢిల్లీ జిల్లా బదర్ పూర్ లోని మోల్డ్ బాండ్ ప్రాంతంలోని ఓ స్కూల్ లో తోటి విద్యార్థిని రాళ్లతో కొట్టి చంపి కాలువలో పడేసిన ఘటన వెలుగులోకి రావడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది.

ఓ 12 ఏళ్ల బాలుడు ఉదయం స్కూలుకు వెళ్లి.

స్నేహితుల చేతిలో దారుణ హత్యకు గురై కాలువలో మృతి దేహంగా తేలుతూ కనిపించాడు.దీనికి సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.

తాజ్పూర్ పహరీలోని( Tajpur Pahari ) ప్రభుత్వ పాఠశాలలో సౌరబ్ అనే బాలుడు 8వ తరగతి చదువుతున్నాడు.సౌరబ్ తల్లిదండ్రులకు ఏకైక మగ సంతానం కావడంతో అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు.

కొడుకు మృతదేహాన్ని చూసి కన్నీరు మున్నీరుగా విలపించారు.పోలీసులకు సమాచారం అందడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు హత్య కేసు నమోదు చేసి ఇద్దరు మైనర్ లను అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

పోలీసుల విచారణలో స్కూల్ ఆవరణలో ఓ విద్యార్థి సిగరెట్ త్రాగడం సౌరబ్( Saurabh ) చూశాడు.అంతేకాకుండా ఈ విషయం టీచర్ కు చెప్తానని బెదిరించడంతో నిందితులు భయపడి హత్య చేసినట్లు తేలింది.

సౌరబ్ తల్లిదండ్రులు స్కూల్లోని కొందరు విద్యార్థులు తమ కొడుకులు వేధించే వారిని, అంతేకాకుండా రకరకాల డ్రగ్స్ తాగేవారని పోలీసులకు తెలిపారు.ప్రతిరోజు మాదిరిగానే సౌరబ్ గురువారం కూడా స్కూలుకు వెళ్లి సాయంత్రం ఎంతసేపైనా ఇంటికి తిరిగి రాలేదు.

దీంతో ఏం చేయాలో తెలియక సౌరబ్ తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించారు.ఆ తర్వాత పోలీసులు సౌరబ్ తల్లిదండ్రులకు ఫోన్ చేసి సౌరబ్ మృతి చెందినట్లుగా తెలిపారు.

ఈ ఘటనపై డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజేష్ దేవ్( Rajesh Dev ) మాట్లాడుతూ.ఏప్రిల్ 27 రాత్రి 8 గంటలకు ఈ హత్య జరిగిందని తెలిపారు.బాలుడి మృతి దేహం పక్కనే స్కూల్ బ్యాగ్ కూడా ఉందని, మృతదేహానికి సమీప ప్రాంతంలో రక్తపు మరకలతో రాళ్లు, తెల్లని గుడ్డ కనిపించాయని తెలిపారు.

వారానికి 2 సార్లు ఈ ఆయిల్ ను వాడితే హెయిర్ ఫాల్, వైట్ హెయిర్ రెండింటికి చెక్!
ఓరి దేవుడా.. ఒక్క చేప ఖరీదు 11 కోట్లా?

పోలీసులు క్రైమ్ కు సంబంధించిన ఆధారాలు సేకరించి.సౌరబ్ పై రాళ్లతో తీవ్రంగా దాడి చేయడంతో సౌరబ్ మృతి చెందినట్లు ధృవీకరించారు.స్థానిక ప్రజలు ఈ ఘటనపై సుమారు ఐదు గంటలసేపు ప్రధాన రహదారిపై నిరసన తెలిపారు.

Advertisement

తాజా వార్తలు