'అసురన్' చరణ్ కి కాదు వెంకటేష్ కి

తమిళ దర్శకుడు వెట్రిమాన్ దర్శకత్వంలో ధనుష్ హీరో గా రూపొందిన చిత్రం అసురన్, ఈ చిత్రం ఇటివల విడుదలై బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ను క్రియేట్ చేసింది.

ఈ చిత్రం ఎక్కంగా 150 కోట్లు వరకు రాబట్టింది.

ధనుష్ సినిమా కెరీర్లో ఈ చిత్రం ఎప్పటికి గుర్తుండి పోతుంది.ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయ్యబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఈ మద్య కాలంలో రామ్ చరణ్ నిర్మాత గా మారి సూపర్ హిట్ట్ చిత్రాలను నిర్మిస్తున్నాడు.అయితే అసురన్ చిత్రాన్ని రామ్ చరణ్ రీమేక్ చేయ్యబోతున్నట్ల్లుగా వార్తలు వస్తున్నాయి.

చరణ్ ఇటివల ఈ చిత్రాన్ని తన స్నేహితులతో కలిసి చూసి సినిమా రీమేక్ పై ఆసక్తి తో ఉన్నాడు అంటూ ప్రచారం జరిగింది.

Advertisement

  కానీ అసురన్ చిత్రాన్ని చరణ్ కాకుండా సురేష్ బాబు రీమేక్ చెయ్యబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి.సురేష్ బాబు ప్రస్తుతం వెంకిమామ చిత్రం తో బిజీగా ఉన్నాడు.ఈ మద్య కాలంలో సురేష్ బాబు కూడా సినిమా నిర్మాణం పై స్పీడ్ పెంచాడు.

తాజా సమాచారం ప్రకారం వెట్రిమాన్ కే తెలుగు రీమేక్ డైరక్షన్ హక్కులను ఇవ్వనున్నట్లు తెలుస్తుంది.సురేష్ బాబు అసురన్ చిత్రాన్ని కలైపులి ఎస్ థాను తో కలిసి తెలుగులో నిర్మించనున్నాడు.

  ప్రస్తుతం వెంకటేష్ వెంకిమామ చిత్రంతో బిజీగా ఉన్నాడు.ఆ చిత్రం పూర్తైన తరువాత వెంకటేష్ కూడా మరే సినిమా కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.వెంకటేష్ కూడా అసురన్ తెలుగు రీమేక్ లో నటించాలన్నీ ఆసక్తితో ఉన్నాడట.

మరి సురేష్ బాబు కూడా వెంకటేష్ ను కాదని మరో హీరోతో చెయ్యడు కావున వెంకటేష్ తదుపరి చిత్రం అసురన్ అవ్వుతుందేమో చూడాలి.

రాజమౌళి తర్వాత అనిల్ రావిపూడి మాత్రమేనా.. వరుసగా 8 హిట్లు సాధించారుగా!
Advertisement

తాజా వార్తలు