గజినికి గతం గుర్తు చేస్తానంటున్న అసురన్

తమిళంలో అసురన్ చిత్రం ఎలాంటి బ్లాక్‌బస్టర్ హిట్ మూవీగా నిలిచిందో అందరికీ తెలిసిందే.

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ మూవీగా నిలవడంలో ధనుష్‌ నటన ఎంత హెల్ప్ అయ్యిందో దర్శకుడిగా వెట్రిమారన్‌ డైరెక్షన్‌ కూడా అంతే ఉపయోగపడింది.

ఇక ఈ సినిమాను ఇప్పుడు తెలుగులో విక్టరీ వెంకటేష్ హీరోగా తెరకెక్కించే ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి.ఇప్పటికే అసురన్ తెలుగు రీమేక్ చిత్రాన్ని దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్‌లో సురేష్ ప్రొడక్షన్స్ అనౌన్స్ చేయగా, ఈ సినిమా షూటింగ్‌ను వీలైనంత త్వరలో మొదలుపెట్టేందుకు రెడీ అవుతున్నాడు వెంకటేష్.

కాగా తమిళంలో సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన దర్శకుడు వెట్రిమారన్, ఇప్పుడు తన నెక్ట్స్ ప్రాజెక్ట్ కోసం రెడీ అవుతున్నాడు.ఇప్పటికే తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన స్క్రిప్టు వర్క్‌ను రెడీ చేసిన దర్శకుడు వెట్రిమారన్, ఈ సినిమాలో స్టార్ హీరో సూర్యను ఎన్నుకున్నట్లు తెలుస్తోంది.

సూర్య లాంటి స్టార్ హీరోతో వెట్రిమారన్ సినిమా అనగానే కోలీవుడ్ వర్గాల్లో అంచనాలు అప్పుడే మొదలయ్యాయి.గతంలో గజిని లాంటి సినిమాను కేవలం తన యాక్టింగ్‌తో బ్లాక్‌బస్టర్ చేసిన సూర్య, ఇప్పుడు అసురన్ డైరెక్టర్‌తో ఎలాంటి సినిమా చేస్తాడా అని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Advertisement

మరి ఈ కాంబోలో రాబోయే సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే.

సూర్య తో మల్టీ స్టారర్ సినిమా చేయనున్న మరో స్టార్ హీరో...

Advertisement

తాజా వార్తలు