పవన్ కళ్యాణ్ కోసం ఉద్యోగం వదులుకున్నా.. అషురెడ్డి షాకింగ్ కామెంట్స్ వైరల్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను దేవుడిలా భావించే అభిమానుల సంఖ్య తక్కువేం కాదు.

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు ఏ స్థాయిలో ప్రాధాన్యత ఇస్తారో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.

గొప్ప స్టార్ హీరో అయినప్పటికీ పవన్ కళ్యాణ్ ప్రజల మధ్యకు వచ్చారంటే సింపుల్ గా ఉంటారు.లేడీ ఫ్యాన్స్ లో పవన్ కళ్యాణ్ కు ఏ స్థాయిలో ప్రాధాన్యత ఉందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.

జూనియర్ సమంతగా పేరు సంపాదించుకున్న అషురెడ్డి పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అనే సంగతి తెలిసిందే.పవన్ కళ్యాణ్ పై ఈ బ్యూటీకి ఏ స్థాయిలో అభిమానం అంటే పవన్ సినిమా కోసం అషురెడ్డి ఏకంగా ఉద్యోగాన్ని కూడా వదులుకుందట.

తాజాగా అషురెడ్డి షాకింగ్ విషయాలను వెల్లడించగా ఆ విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.పవన్ టాటూలను వేసుకోవడం ద్వారా వార్తల్లో నిలిచిన అషురెడ్డి కాటమరాయుడు సినిమా ఫస్ట్ షో చూడటం కోసం జాబ్ ను వదులుకున్నానని తెలిపారు.

Advertisement

ఆ సమయంలో ఫ్యామిలీ మెంబర్స్ బాగా తిట్టారని అయితే నేను అలా చేయడం నాకు తప్పని అనిపించలేదని ఆమె అన్నారు.డల్లాస్ లో ఉన్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుందని అషురెడ్డి కామెంట్లు చేశారు.పవన్ కళ్యాణ్ గ్రేట్ ఆటిట్యూడ్ వల్లే ఆయనకు ఈ స్థాయిలో అభిమానించే అభిమానులు దొరికారని కొంతమంది సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.

షురెడ్డి బుల్లితెర షోలతో బిజీ కావాలని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తుండగా ఆమె కెరీర్ ప్లానింగ్ ఏ విధంగా ఉండబోతుందో చూడాల్సి ఉంది.అషురెడ్డి పోస్ట్ కు రికార్డ్ స్థాయిలో లైక్స్ వస్తున్నాయి.

కొంతమంది మాత్రం అషురెడ్డిపై నెగిటివ్ కామెంట్లు చేస్తుండటం గమనార్హం.

ఇంట్లో ఈ వస్తువులను ఖాళీగా పెడుతున్నారా..? అయితే దరిద్రం పట్టిపీడించడం ఖాయం..!
Advertisement

తాజా వార్తలు