బిగ్ బాస్ 3 సీజన్ తర్వాత అషు రెడ్డి బాగా పాపులర్ గా మారింది.సోషల్ మీడియాలో అషు రెడ్డి ఎంత జోరుగా ఉంటుందో అందరికీ తెలిసిందే.
ఎప్పటికప్పుడు తన ఫోటోలను, తనకు సంబంధించిన వీడియోలు తీసి నెట్టింట్లో తెగ అభిమానులకు షేర్ చేస్తూంటుంది.మొత్తానికి అషు రెడ్డి ఓ సెలబ్రిటీగా పేరు సంపాదించుకుంది.
అషు రెడ్డి సోషల్ మీడియాలో అడుగు పెట్టి ఆ తర్వాత బుల్లితెరపై పరిచయమయ్యింది.ఆమె మొదట్లో సోషల్ మీడియాలో డబ్ స్మాష్ వీడియో లో బాగా ఫేమస్ అయ్యింది.
చూడటానికి సమంతా ల ఉన్న అషు రెడ్డి కి జూనియర్ సమంత అని పేరు కూడా వచ్చింది.అతి తక్కువ సమయంలో అషు రెడ్డి కెరీర్ మొత్తం మారిపోయింది.
అంతే కాకుండా ఆమెకు సినిమాల్లో నటించాలన్న ఆసక్తి కూడా కలిగింది.దీంతో చల్ మోహన్ రంగ సినిమా లో అషు రెడ్డి నటించింది.

ఆ తర్వాత తను తన ఉద్యోగం కోసం అమెరికాకు వెళ్ళింది.అక్కడ ఓ అబ్బాయి తో ప్రేమాయణం చేసి చివరకు బ్రేకప్ చేసింది.దీంతో డిప్రెషన్ లోకి వెళ్లి శరీర బరువును పట్టించుకోకుండా పోయింది.ఇదిలా ఉంటే బిగ్ బాస్ త్రీ సీజన్ లో పాల్గొన్న అషు రెడ్డి.అందులో ఇచ్చిన గేమ్ లలో బాగా పాల్గొన్నది.అయితే ఇటీవలే ఆమెకు బుల్లితెరలో మరో అవకాశం రాగా స్టార్ మా లో వస్తున్న కామెడీ స్టార్స్ అనే షో లో పాల్గొన్నది.
ఇక ఆ సమయంలో జరిగిన ఓ సన్నివేశం గురించి వీడియో ద్వారా సోషల్ మీడియాలో షేర్ చేసింది.
వచ్చేవారం ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో విడుదల కాగా అందులో జడ్జిలు.
స్టేజీపై నూనె పోసి ఉన్నా అందులో సిగ్నేచర్ స్టెప్స్ చేయాలని అవినాష్, హరికి చెప్పారు.దీంతో వాళ్లు కింద పడుతూ లేస్తూ అషు రెడ్డిని కూడా రమ్మని జడ్జితో కోరారు.దీంతో ఆమె చీరలో ఉండగా.‘భూం బద్ధల్’ పాటకు కు స్టెప్పు చేసింది.కానీ ఆమె పడుతుందని అనుకొని ఆతృతగా ఎదురు చూసిన అవినాష్, హరి లు స్టేజి మీదనే పడుకున్నారు.కానీ అషు రెడ్డి మాత్రం పడకుండా ధైర్యంగా డాన్స్ చేసింది.
ఇక ఈ వీడియోను షేర్ చేయగా ‘నేనంత ఈజీగా పడను’ అని కామెంట్ చేసింది
.