హీరోయిన్ ఆషికా రంగనాథ్ గురించి మీకు తెలుసా.. ఇంతకుముందే ఆమె సినిమాలలో నటించిందా?

టాలీవుడ్ హీరో కళ్యాణ్ రామ్ తాజాగా నటించిన చిత్రం అమిగోస్.ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన ఆషికా రంగనాథ్ హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే.

అయితే ఈ సినిమా రేపు అనగా ఫిబ్రవరి 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు.

ఇది ఇలా ఉంటే సినిమాలో హీరోయిన్గా నటించిన ఆషికా రంగనాథ్ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి.అయితే చాలామందికి ఈ ఆషికా రంగనాథ్ ఎవరు అన్నది తెలియదు.

మరి ఆమె గురించి మరిన్ని వివరాల విషయానికి వస్తే.అమిగోస్ సినిమాతో ఆషికా రంగనాథ్ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం కాబోతోంది.

Advertisement

అయితే ఈ ముద్దుగుమ్మ మొదట 2016లో కన్నడలో విడుదలైన క్రేజీ బాయ్ అనే సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.ఈ సినిమా విడుదల అయ్యి మంచి సక్సెస్ ను అందుకుంది.

ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మ శివరాజ్ కుమార్ హీరోగా నటించిన మాస్ లీడర్ అనే సినిమాలో నటించి మెప్పించింది.

అలాగే దివంగత నటుడు హీరో పునీత్ రాజ్ కుమార్ నటించిన జేమ్స్ సినిమాలో కూడా నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ.అయితే కన్నడలో తప్పితే ఇతర భాషల్లో ఈమె చాలా తక్కువగా నటించింది.ఆ తర్వాత ఈమె 2022లో అనగా గత ఏడాది పట్టాతు అరసన్ సినిమాతో తమిళం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.

తాజాగా అమిగోస్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమయ్యింది.

ఆ నటుడు నన్ను చూపుతోనే భయపెట్టాడు.. రజనీకాంత్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
నడుము అందాలతో తెల్ల చీరలో క్యూట్​గా పూజా

అయితే ఈ సినిమాపై ఆషికా రంగనాథ్ చాలా ఆశలు పెట్టుకుంది.ఈ సినిమా కనుక హిట్ అయితే ఈమెకు తెలుగులో అవకాశాలు వస్తాయి అనడంలో ఎటువంటి అతిశయో శక్తి లేదు.ఇకపోతే అమిగోస్ సినిమా విషయానికి వస్తే ఇందులో కళ్యాణ్ రామ్ త్రిపత్రాభినయంలో నటించిన విషయం తెలిసిందే.

Advertisement

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పోస్టర్, పాటలకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది.ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

తాజా వార్తలు