పార్లమెంట్ సమావేశాలను బీఆర్ఎస్, ఆప్ శ్రేణులు బహిష్కరించాయి.అదానీ వ్యవహారంపై ఉభయసభల్లో బీఆర్ఎస్ వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టింది.
ఈ క్రమంలో వాయిదా తీర్మానాలు తిరస్కరించడంతో సభలను బహిష్కరించిన ఎంపీలు ఆందోళన కార్యక్రమం చేపట్టారు.అనంతరం పార్లమెంట్ లోని గాంధీ విగ్రహం వద్ద నిరసనకు దిగారు.
అదానీ వ్యవహారంపై పార్లమెంట్ లో చర్చ జరపాలని డిమాండ్ చేశారు.