బీఆర్ఎస్.. మేనిఫెస్టో పై పొగడ్తలు మళ్లీ కేసీఆరే సీఎం అంటున్న అసదుద్దీన్..!!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై అసదుద్దీన్ ఒవైసీ( Asaduddin Owaisi ) సంచలన వ్యాఖ్యలు చేశారు.తాజాగా జాతీయ మీడియాతో మాట్లాడుతూ.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్( CM KCR ) గత తొమ్మిది సంవత్సరాలుగా రైతుల కోసం బాగా పనిచేశారని కొనియాడారు.ఇదే సమయంలో రైతు బీమా( Rythu Bima )ను ప్రారంభించినట్లు చెప్పుకొచ్చారు.

దాన్నే ప్రధాని మోడీ కాపీ కొట్టారని ఆరోపించారు.కచ్చితంగా వచ్చే ఎన్నికలలో మళ్లీ కేసీఆర్ ని ప్రజలు ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటారని తాను భావిస్తున్నట్లు అసదుద్దీన్ స్పష్టం చేయడం జరిగింది.

ఇదే సమయంలో బీఆర్ఎస్ ప్రకటించిన మేనిఫెస్టో చాలా బాగుందని అన్నారు.మైనారిటీలకు బడ్జెట్ పెంచుతామని తెలిపారు.

Advertisement

అదేవిధంగా ప్రజలకు 400 రూపాయలకే గ్యాస్ ఇస్తామని చెప్పటం సంతోషించదగ్గ విషయం.వచ్చే ఎన్నికలలో ఏఐఎంఐఎం ఎన్ని స్థానాలలో పోటీ చేస్తుందనే విషయం.త్వరలో వెల్లడిస్తామని స్పష్టం చేశారు.

ఇదే సమయంలో ఏఐఎంఐఎం పోటీ చేయని చోట బీఆర్ఎస్ పార్టీకే( BRS Party ) తమ మద్దతు ఉంటుందని అన్నారు.ఇంక దేశ విభజనపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

దేశ విభజన చారిత్రాత్మక తప్పిదం.విభజన జరగకుండా ఉండాల్సింది.

కానీ దురదృష్టవశాత్తు జరిగింది.అప్పటి ఇస్లామిక్ పండితులు కూడా ఇరుదేశాల సిద్ధాంతాన్ని వ్యతిరేకించారు.

రూ. 1 కోటి ప్రశ్నకు సరైన సమాధానం చెప్పినా.. కంటెస్టెంట్ కి నిరాశే..?
అల్లు, మెగా ఫ్యామిలీలు కలిసిపోయినట్టేనా.. ఈ కుటుంబాల మధ్య గ్యాప్ తగ్గుతుందా?

భారత్.పాక్ విభజన జరగటం దురదృష్టకరం.

Advertisement

దేశ విభజనకు బాధ్యుడు ఎవరు అనే విషయంపై డిబేట్ పెడితే తాను.సంపూర్ణంగా వివరించి చెబుతానని అసదుద్దీన్ ఓవైసీ తెలియజేశారు.

తాజా వార్తలు