అనుకున్నట్లే బాల్ ను గ్రౌండ్ దాటించాడు..ఇషాన్ బ్యాటింగ్ గు ఫిదా

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న శ్రీలంక, భారత్ వన్డే మ్యాచ్ జరిగింది.ఈ మ్యాచ్ లో టీమిండియా గొప్ప విజయాన్ని అందుకుంది.

శ్రీలంక టీమ్ తో మొదటి వన్డే మ్యాచ్ లో ఇండియా జట్టులో ఆటగాడు ఇషాన్‌ కిషన్‌ హాఫ్ సెంచరీ సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.ఇషాన్ కేవలం 42 బంతుల్లోనే 59 పరుగులు చేశాడు.8 ఫోర్లు, 2 సిక్సులతో గ్రౌండ్ లో చెలరేగిపోయాడు.ఈ మ్యాచ్‌ ద్వారా వన్డే క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన ఇషాన్ కు కేవలం 23 ఏళ్లు మాత్రమే.

ఇతడు ఝార్ఖండ్‌ రాష్ట్రానికి చెందిన వ్యక్తి.క్రీజ్ లోకి వెళ్లిన తర్వాత మొదటి బాల్ కే సిక్స్ కొట్టి అందర్నీ ఉర్రూతలూగించాడు.

మ్యాచ్‌ జరగడానికి ముందుగా తన సహచరులకు సవాల్‌ విసిరానని, బంతి ఎక్కడ పడినా కూడా కచ్చితంగా దానిని గ్రౌండ్ దాటిస్తానని సవాల్ విసిరినట్లు చెప్పుకొచ్చాడు.చహ‌ల్‌తో చేసిన చిట్‌చాట్‌ సందర్భంగా ఇషాన్‌ స్వయంగా ఈ విషయాన్ని తెలిపాడు.

Advertisement

తాను అనుకున్నట్టుగానే అందరికీ చెప్పినట్లుగానే మొదటి బాల్ నే గ్రౌండ్ దాటించడం ఎంతో ఆనందంగా ఉందని ఇషాన్‌ తెలిపాడు.ఇకపోతే రెండో బాల్ ని సైతం ఫోర్ కొట్టాడు.

ఇషాన్ క్రీజ్‌లో బౌండరీలు, సిక్సర్లు బాదుతూ ప్రత్యర్థులకు చెమటలు పట్టించాడు.ఆఖరికి సందకన్‌ బౌలింగ్‌లో భానుకకు క్యాచ్‌ ఇచ్చి ఔట్ అయ్యాడు.అయితే మాత్రం అరంగేట్రం చేసిన వన్డేలోనే ఇషాన్ హాఫ్‌ సెంచరీ చేయడం అందర్నీ ఆకట్టుకుంది.టీ20లో అరంగేట్రం చేసినప్పుడు కూడా ఈ బాట్స్ మెన్ హాఫ్ సెంచరీ చేశాడు.

ఈ సంవత్సరం మార్చి నెలలో ఇంగ్లండ్‌ జట్టుతో జరిగిన టీ20 సిరీస్‌లో ఇషాన్‌ తన సత్తా చాటాడు. అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20లో మ్యాచ్ లో ఇషాన్ ఓపెనర్‌గా క్రీజ్ లోకి వచ్చాడు.ఆ తర్వాత 32 బంతుల్లోనే 56 పరుగులు చేసి ఔరా అనిపించాడు.

తొలి టీ20లోనే ఇషాన్ ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డును గెలుచుకోవడం గొప్ప విషయం.ప్రస్తుతం ఇషాన్ ఎంతోొ దూకుడు మీద ఉన్నాడని క్రికెట్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

వైరల్ వీడియో : క్యాబ్ డ్రైవర్ తో హీరో గొడవ..
Advertisement

తాజా వార్తలు