గ్రూప్-1 పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు:కలెక్టర్

యాదాద్రి భువనగిరి జిల్లా: జూన్ 9న జరిగే గ్రూప్-1 పరీక్ష( Group-1 Exam)కు పకడ్బందీ ఏర్పాట్లు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ హనుమంత్ కే.

జెండగే తెలిపారు.

డిప్యూటీ పోలీసు కమీషనర్ రాజేశ్ చంద్రతో కలిసి కాన్పరెన్స్ హాలులో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ భువనగిరి పట్టణంలోని తొమ్మిది పరీక్షా కేంద్రాలలో గ్రూపు-1 ( TSPSC ) పరీక్ష నిర్వహించడం జరుగుతుందని,మొత్తం 3349 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారన్నారు.ఒక నిమిషం ఆలస్యమైనా అనుమతించరని, అభ్యర్థులు ముందుగానే పరీక్ష కేంద్రాలకు( examination centers) చేరుకోవాలని సూచించారు.

Armored Arrangements For Group-1 Examination: Collector ,Collector ,Group-1 Exam

పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ పకడ్బందీగా అమలు చేయాలని,పరీక్ష రోజు అన్ని జీరాక్సు షాపులు బంద్ చేసి ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.ఈ సమావేశంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టరు కే.గంగాధర్,జిల్లా విద్యాశాఖ అధికారి కే.నారాయణరెడ్డి,జిల్లాకు సంబంధించి గ్రూప్-1 పరీక్ష నిర్వహణ రీజనల్ కోఆర్డినేటరు డాక్టర్ హలావత్ బాలజీ, రాచకొండ ఎసిపి టి.కరుణాకర్,జిల్లా వైద్య అధికారి డాక్టర్ పాపారావు,తహశీల్దార్ అంజిరెడ్డి,ఇంటర్మీడియట్ జిల్లా నోడల్ అధికారిణి రమణి,జిల్లా పౌర సంబంధాల అధికారి పి.వెంకటేశ్వరరావు, విద్యుత్,రవాణా,ఆర్టీసి తదితర సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Latest Video Uploads News