Sleep : ప్రతిరోజు అర్ధరాత్రి తర్వాత నిద్రపోతున్నారా… అయితే ఈ ఆరోగ్య సమస్యలు రావడం ఖాయం..!

నిద్ర( sleep ) ఒక గొప్ప ఔషధమని దాదాపు చాలా మందికి తెలుసు.నిద్ర వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం ఎంతో మెరుగ్గా ఉంటుంది.

అయితే ఇప్పటి యువత చాలా వరకు నిద్రపోయే సమయం అర్ధరాత్రి దాటిన తర్వాతే అని నిపుణులు చెబుతున్నారు.ప్రస్తుత సమాజంలోని యువత అర్ధరాత్రి వరకు మేల్కోవడం, మొబైల్ బ్రౌజింగ్, చాటింగ్, సినిమాలు చూడడం వంటి వాటి వల్ల ఆలస్యంగా నిద్రపోతున్నారు.

అయితే ఇలా అర్ధరాత్రి దాటిన తర్వాత నిద్రపోవడం వల్ల ఈ ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.మరి ఆ అనారోగ్య సమస్యలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖ్యంగా చెప్పాలంటే సిర్కాడియన్ రిథమ్( Circadian rhythm ) అనే నిద్ర చక్రం ప్రతి ఒక్కరిలో ఉంటుంది.

Advertisement

ఇది శరీరం కాంతికి లోనయ్యే పరిస్థితుల ఆధారంగా పని చేస్తుంది.రాత్రి నిద్ర పోవడం ఉదయాన్నే మేల్కొనడానికి అనుకూలంగా ఇది ఉంటుంది.కానీ అర్ధరాత్రి నిద్ర పోవడం వల్ల ఈ నిద్ర చక్రం డిస్టర్బ్ అవుతుంది.

దీని వల్ల రోజంతా అలసటగా, నీరసంగా ఉండి రోజంతా ఏ పని మీద ఆసక్తి లేకుండా ఉండడం ఉంటుంది.ఇంకా చెప్పాలంటే రోగ నిరోధక వ్యవస్థ ( Immune system )చక్కగా ప్రతిస్పందించాలంటే మంచి నిద్ర ఎంతో అవసరం.

గాడమైన నిద్ర శరీరంలో సైటోకిన్లను ఉత్పత్తి చేస్తుంది.ఇది ఇన్ఫెక్షన్లు ఇన్ప్లమేషన్ల తో పోరాడడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.అలాగే పేలవమైన నిద్ర వల్ల సైటోకిన్లు ఉత్పత్తి తగ్గి రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకున్న అది సరిగ్గా పనిచేయదు.

ఇంకా చెప్పాలంటే అర్ధరాత్రి నిద్రపోయే వారిలో ఎక్కువ శాతం మంది బరువు పెరుగుతారు.ఆకలిని నియంత్రించే లెప్లిన్, గ్రెలిన్( Leplin, ghrelin ) తో సహా ఇతర హార్మోన్ల సమతుల్యత ఆలస్యంగా నిద్రపోవడం వల్ల దెబ్బతింటుంది.దీనికి కారణంగా అధిక ఆకలి, ఎంత తిన్నా కడుపు నిండినట్టు అనిపించకపోవడం, ఫాస్ట్ ఫుడ్, కృత్రిమ జ్యూసులు వంటివి తాగాలని అనిపించడం జరుగుతుంది.

రాజాసాబ్ సినిమా వచ్చేది అప్పుడేనా..?మారుతి ఎందుకంత స్లో గా వర్క్ చేస్తున్నాడు...
సింప్లిసిటీకి పర్‌ఫెక్ట్‌ ఎగ్జాంపుల్‌ ప్రభాస్‌.. వైరల్ అవుతున్న శిరీష్ ఆసక్తికర వ్యాఖ్యలు!

దీని వల్ల బరువు కూడా పెరుగుతారు.అలాగే దీర్ఘకాలిక వ్యాధులు అయిన గుండె జబ్బులు, మధుమేహం, ఊబకాయం( Heart disease, diabetes, obesity ) వంటి దీర్ఘకాలిక వ్యాధులు రావడానికి ఆలస్యంగా నిద్రపోవడమే కారణమని నిపుణులు చెబుతున్నారు.

Advertisement

హార్మోన్ల అసమతుల్యత, రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడానికి నిద్రలేమి సమస్య కారణమవుతుందని కూడా చెబుతున్నారు.

తాజా వార్తలు