యానిమల్ సినిమా( Animal Movie ) విడుదలై రెండు నెలలు దాటినా సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి ఏదో ఒక చర్చ జరుగుతూనే ఉంది.సందీప్ రెడ్డి వంగా( Sandeep Reddy Vanga ) సైతం ఈ సినిమా గురించి తన అభిప్రాయాలను బోల్డ్ గా పంచుకుంటూ అభిమానులకు దగ్గరవుతున్నారు.
వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్న సందీప్ ఈ సినిమా గురించి తన భార్య, కొడుకు అభిప్రాయాలను పంచుకున్నారు.ఏ రేటింగ్ సన్నివేశాలు లేని వెర్షన్ ను నా కొడుకు చూశాడని ఆయన తెలిపారు.
కొడుకుకు చూపించకూడని సన్నివేశాలను ఎడిట్ చేసి ఒక హార్డ్ డిస్క్ లో ఉంచానని సినిమా నా కొడుకుకు చాలా నచ్చిందని అండర్ వేర్ సీన్స్ కామెడీగా ఉన్నాయని నా కొడుకు చెప్పాడని సందీప్ రెడ్డి వంగా పేర్కొన్నారు.అయితే నా భార్య మనీషా( Maneesha ) మాత్రం యానిమల్ సినిమాలో రక్తపాతం సీన్స్ విషయంలో నిరుత్సాహానికి గురైందని అన్నారు.
స్త్రీ పాత్రను చూపించిన విధానం గురించి మాత్రం మనీషా పెద్దగా చెప్పలేదని సందీప్ వెల్లడించారు.
నేను తీసే సినిమాలకు నా సోదరుడు ప్రణయ్ రెడ్డి( Pranay Reddy ) నుంచి సరైన ఫీడ్ బ్యాక్ వస్తుందని ఆయన అన్నారు.ప్రణయ్ రెడ్డి చెప్పిన విధంగానే సినిమా రిజల్ట్ ఉంటుందని సందీప్ రెడ్డి వంగా తెలిపారు.సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో నటించడానికి టాలీవుడ్ ఇండస్ట్రీ హీరోలతో పాటు ఇతర భాషల హీరోలు సైతం ఆసక్తి కనబరుస్తున్నారు.
ప్రభాస్, బన్నీ, రణ్ బీర్ సందీప్ రెడ్డి తర్వాత సినిమాల జాబితాలో ఉన్నారు.
ఈ హీరోలను సందీప్ రెడ్డి వంగా ఏ విధంగా చూపించబోతున్నారో చూడాల్సి ఉంది.సందీప్ రెడ్డి వంగా సినిమాలకు ఓటీటీలలో సైతం అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.సందీప్ రెడ్డి వంగా తర్వాత సినిమాలకు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.