మీ ఫోన్ వైబ్రేషన్‌లో ఉంచుతున్నారా.. డేంజర్‌లో పడ్డట్టే..!

చాలా మంది ప్రజలు తమ మొబైల్ ఫోన్లను వైబ్రేషన్ మోడ్‌లో ఉంచుతారు.

ఆఫీసులో పని చేస్తున్నప్పుడు, స్కూల్ లేదా కాలేజీలో ఉన్నప్పుడు లేదా మరి ఇంకేదైనా బిజీలో ఉన్నప్పుడు ఫోన్‌ను వైబ్రేషన్‌లో ఉంచడం చాలామందికి అలవాటు.

అయితే ఇలా వైబ్రేషన్‌లో ఉన్న ఫోన్‌ను జేబులో ఉంచుకుంటే.డేంజర్‌లో పడ్డట్టేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

సాధారణంగా ఏదైనా కాల్ లేదా మెసేజ్ వచ్చినప్పుడు వైబ్రేషన్‌లో ఉన్న ఫోన్ బాగా వైబ్రేట్ అవుతుంది.ఈ వైబ్రేషన్‌తో కొందరు ఉలిక్కిపడుతుంటారు.

అయితే ఈ సమస్య తీవ్రమైతే ‘ఫాంటమ్ వైబ్రేషన్ సిండ్రోమ్’ అనే ఒక సమస్య తలెత్తే ప్రమాదం ఉందంటున్నారు వైద్యులు.గంటల తరబడి మొబైల్‌ను జేబులో ఉంచుకోవడం వల్ల పదే పదే వచ్చే దాని వైబ్రేషన్ మన బ్రెయిన్ పై ప్రభావం చూపుతుంది.

Advertisement

దీనివల్ల ఫోన్ వైబ్రేట్ కాకపోయినా ఏదో ఫోన్ వస్తున్నట్టు లేదా మెసేజ్ వచ్చినట్లు భ్రమ కలుగుతుంది.ప్రస్తుతం ఈ సమస్య పదిలో తొమ్మిదిమందిని వేధిస్తున్నట్లు నివేదికలు తెలుపుతున్నాయి.

ఈ సమస్య మరింత పెచ్చరిల్లుతున్నట్లు వైద్య నిపుణులు సైతం వెల్లడిస్తున్నారు.ఈ మానసిక సమస్యకు మొగ్గ దశలోనే అడ్డుకట్ట వేయాలని సూచిస్తున్నారు.

ఒకవేళ ఈ సమస్యతో బాధపడుతున్నట్లైతే.ఏదో శబ్దం వినిపించినట్లు భ్రమ పడటం, అంతుపట్టని ఆందోళన, ఏకాగ్రత లోపించడం, చికాకు వంటి సమస్యలు వేధిస్తాయి.

ఈ సమస్యను ఎలా ఎదుర్కోవాలి?మొబైల్‌ను నిరంతరం వైబ్రేషన్‌లో ఉంచకూడదు.అవసరమైతే ఫోన్‌ను సైలెంట్ మోడ్‌లో ఉంచాలి.ఫోన్‌ను వైబ్రేషన్‌లో ఉంచి జేబుల్లో  ఎట్టిపరిస్థితులలోనూ ఉంచరాదు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

మొబైల్‌ను వైబ్రేషన్ నుంచి రింగింగ్ మోడ్‌కి మార్చినా ఎలాంటి సమస్యలు రావు.గ్యాడ్జెట్ లకు వీలైనంత దూరంగా ఉండటం వల్ల ఇలాంటి సమస్య నుంచి బయట పడవచ్చు.

Advertisement

వీలైతే మానసిక వైద్యుని సంప్రదించి ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.అయితే ఈ సమస్య రాకముందే జాగ్రత్త పడటం మరింత శ్రేయస్కరం.

తాజా వార్తలు