అవినీతి ఎమ్మెల్యేలతో.. కే‌సి‌ఆర్ కు ముప్పే?

తెలంగాణలో మరో నాలుగు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి.దీంతో ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల మూడ్ లోకి వచ్చేశాయి.

ముఖ్యంగా అధికార బి‌ఆర్‌ఎస్ పార్టీ( BRS party ) ఈసారి కూడా విజయం సాధించి ముచ్చటగా మూడో సారి అధికారం చేపట్టాలని పట్టుదలతో ఉంది.అధినేత కే‌సి‌ఆర్ అందుకు తగ్గట్టుగానే వ్యూహాలు రచిస్తూ ముందుకు సాగుతున్నారు.

రాష్ట్రం ఏర్పడినది మొదలుకొని రెండు సార్లు గెలిచిన బి‌ఆర్‌ఎస్ స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శించి అధికారం చేజిక్కించుకుంది.కాగా ఈసారి మాత్రం అంతకు మించి అనేలా ఏకంగా 100 సీట్లు కైవసం చేసుకోవాలంటే టార్గెట్ పెట్టుకుంది.

దాంతో ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల విషయంలో కే‌సి‌ఆర్( KCR ) ఆచితూచి అడుగులు వేస్తున్నారు.ప్రజా మద్దతు ఉన్నవారికే సీటు అని, సర్వేల ఆధారంగానే ఎంపిక ఉంటుందని తేల్చి చెబుతున్నారు.దాంతో సిట్టింగ్ ఎమ్మెల్యేలలో ఎవరికి సీటు దక్కే అవకాశం ఉంది అనేది ఆసక్తికరంగా మారింది.ఇదిలా ఉంచితే బి‌ఆర్‌ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సంబంధించి మరో అంశం ప్రస్తుతం తెలంగాణ పోలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.2018 లో ఎన్నికల సందర్భంగా దాదాపు 25 మంది ఎమ్మేల్యేలు తప్పుడు అఫిడవిట్లు దాఖలు చేసినట్లు సమాచారం.

Advertisement

వారిలో బి‌ఆర్‌ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఈ నెలాఖరులోనే హైకోర్టు ఈ కేసులపై తీర్పు ఇచ్చే అవకాశం ఉంది.దీంతో ఎవరిపై వేటు పడుతుందో అనే చర్చ ఆసక్తికరంగా మారింది.

అసలే పలువురు ఎమ్మేల్యేలు అవినీతికి పాల్పడుతున్నారని వారంతా జాగ్రత్తగా ఉండాలని లేదంటే కఠిన చర్యలు తప్పవని స్వయంగా కే‌సి‌ఆరే.ఆయన పార్టీ ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చిన సంగతి విధితమే.

ఇప్పుడు ఎమ్మెల్యేల అవినీతి నిజమానే రీతిలో తప్పుడు అఫిడవిట్ల అంశం తెరపైకి రావడంతో బి‌ఆర్‌ఎస్ ను తీవ్రంగా కలవర పరుస్తోంది.ఒకవేళ అఫిడవిట్ల అంశం నిజమని తేలితే ఆ ఎమ్మెల్యేలపై కే‌సి‌ఆర్‌ ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.

అల్లు అర్జున్ అరెస్టు పెద్ద కుట్ర ఉంది.. సింగర్ కల్పన షాకింగ్ కామెంట్స్?
Advertisement

తాజా వార్తలు