థర్డ్ వేవ్ కు ఇప్పటినుండే ప్రిపేర్ అవుతున్నాం.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్..!

కరోనా సెకండ్ వేవ్ తీవ్రత ఢిల్లీలో కొద్దిగా తగ్గిందని ఇక రాబోతున్న థర్డ్ వేవ్ పై ముందుగానే సిద్ధం అవుతున్నామని అన్నారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.

సెకండ్ వేవ్ లో రోజుకి 28 వేల కొవిడ్ కేసులు చూశామని.

మూడవ దశలో ఇంతకన్నా ఎక్కువ కేసులే వచ్చే అవకాశాలు ఉన్నాయని అన్నారు.రోజుకి 37 వేలకు పైగా కేసులు నమోదైనా ఆశ్చర్యపడాల్సింది ఏమి లేదని అన్నారు.

కొవిడ్ థర్డ్ వేవ్ గురించి ఇప్పటినుండే తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని శనివారం మీడియాతో చెప్పారు సీఎం కేజ్రీవాల్.పీడియాట్రిక్ టాస్క్ ఫోర్స్ ను రెండు జీనోం సీక్వన్సింగ్ ల్యాబ్ లను ఏర్పాటు చేతున్నామని.ఇంపార్టెంట్ మెడిసిన్స్ ను బఫర్ స్టాక్ గా చేస్తున్నామని అన్నారు.420 టన్నుల ఆక్సీజన్ స్టోరేజ్ కెపాసిటీని ఏర్పాటు చేసుకుంటున్నాం.కొద్దివారాల్లో 25 ఆక్సీజన్ ట్యాంకర్లను కొనుగోలు చేస్తున్నామని తెలిపారు సీఎం కేజ్రీవాల్.

థర్డ్ వేవ్ లో ప్రాణవాయువు కొరత రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆయన అన్నారు.థర్డ్ వేవ్ పిల్లపై ఎక్కువ ప్రభావం చూపిస్తుందని అంటున్నారని.వారిని కాపాడుకునేందుకు ప్రత్యేకంగా పీడియాట్రిక్ టాస్క్ ఫోర్స్ ను నియమిస్తున్నామని ఆ బృందం ద్వారా బాలలకు ప్రత్యేక వైద్య సౌకర్యాలు, ఐసీయు, బెడ్స్ ను ఏర్పాటు చేస్తామని కేజ్రీవాల్ అన్నారు.150 టన్నుల ఆక్సీజన్ ఉత్పాదక ప్లాంట్ ను ఏర్పాటు చేయాలని ఇంద్రప్రస్థ గ్యాస్ సంస్థని కోరినట్టు ఆయన చెప్పారు.

Advertisement
ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?

తాజా వార్తలు