ఏఆర్ రెహమాన్ కొత్త అల్లుడు గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

తెలుగు సినీ ప్రేక్షకులకు సంగీత దర్శకుడు అయినా ఏ ఆర్ రెహమాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

భారతీయ సినీ చరిత్రలోనే ఆస్కార్ అవార్డును సాధించిన ఏకైక మ్యూజిక్ డైరెక్టర్ గా ఏ ఆర్ రెహమాన్ గుర్తింపును సంపాదించుకున్నారు.

ఇతను ఎప్పుడూ కూడా మ్యూజిక్ డైరెక్టర్ సినిమాలు, మ్యూజిక్ ఆల్బమ్స్ అంటూ ఫుల్ బిజీగా ఉంటారు.తనకు సమయం దొరికినప్పుడల్లా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను సినిమాలకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.

ఈ క్రమంలోనే తాజాగా ఆయన తన కుమార్తె ఖతిజా రెహమాన్ వివాహ విషయాల గురించి తన అభిమానులతో పంచుకున్నారు.ఈ సందర్భంగా రెహమాన్ సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తూ ఆ భగవంతుడు ఈ జంటను ఆశీర్వదించాడు మీరు కూడా మీ చల్లని దీవెనలు అందించినందుకు ధన్యవాదాలు తెలిపాడు.

ఖతీజా రెహమాన్ కు పలువురు అభిమానులు, నెటిజన్స్ తో పాటు శ్రేయా ఘోషల్ సహా పలువురు ప్రముఖులు ఖతీజా రెహమాన్ ఆమె భర్త రియాస్దీన్ రియాన్‌కు అభినందనలు తెలిపారు.

Advertisement

రెహమాన్ కుమార్తె ఖతీజా రెహమాన్ కూడా తన కుటుంబంతో ఉన్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయ‌ట‌మే కాకుండా త‌న భ‌ర్త రియాస్దీన్ రియాన్‌తో ఉన్న ఫొటోను ప్ర‌త్యేకంగా షేర్ చేస్తూ.జీవితంలో ఈ రోజు కోసం ఎంతో ఎదురు చూశాను.నా మనిషి రియాస్దీన్ రియాన్‌ను వివాహం చేసుకున్నాను అని తెలియింది ఖతీజా రెహమాన్.

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఖతీజా రెహమాన్ మ్యారేజ్ కి సంబంధించిన ఫొటోస్ వైరల్ అవుతున్నాయి.ఎ.ఆర్‌.రెహ‌మాన్‌కు అల్లుడు అవుతున్నారంటే, ఆయ‌న ఏం చేస్తున్నారో తెలుసుకోవాల‌నే ఆసక్తి అంద‌రిలోనూ ఉంటుంది.

ఇక రియాస్దీన్ రియాన్ ఆడియో ఇంజ‌నీర్‌, అంతే కాదండోయ్ ఎంట్ర‌ప్రెన్యూర‌ర్ కూడా.ఇక ఖ‌తీజా విష‌యానికి వ‌స్తే ఆమెకు కూడా తండ్రి బాట‌లోనే సాగుతున్నారు.

రీసెంట్‌గా విడుద‌లైన మీమి చిత్రంలోని రాక్ ఏ బై బేబీ అనే పాట‌ను ఖ‌తీజానే పాడారు.

టాలీవుడ్ స్టార్స్ కు మోక్షజ్ఞ గట్టి పోటీ ఇస్తారా.. అలా జరిగితే మోక్షజ్ఞకు తిరుగులేదంటూ?
Advertisement

తాజా వార్తలు