ఏపీఎస్‌ ఆర్టీసీకి మరీ ఇంత తొందర ఎందుకబ్బా?

లాక్‌డౌన్‌ గడువు ఏప్రిల్‌ 14తో ముగియబోతుంది.ఈ నేపథ్యంలో 15వ తారీకు నుండి యదావిధిగా సాగబోతున్నాయని అంతా అనుకున్నారు.

కాని కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టని కారణంగా ఇంకొన్నాళ్లు తప్పనిసరి పరిస్థితుల్లో లాక్‌డౌన్‌ను విధిగా అమలు చేయాల్సిందే అంటూ ముఖ్యమంత్రులు ఇంకా పలువురు నాయకులు కేంద్రంను కోరిన విషయం తెల్సిందే.దాంతో కేంద్రం లాక్‌ డౌన్‌పై కీలక ప్రకటన చేసేందుకు సిద్దం అవుతున్నట్లుగా సమాచారం అందుతోంది.

ఆ కీలక ప్రకటన లాక్‌ డౌన్‌ పొడగింపు లేదంటే రాష్ట్రాలు ఎవరికి వారుగా లాక్‌డౌన్‌ను కొనసాగించుకునే వెసులుబాటు కల్పించబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.ఈ సమయంలోనే ఏపీఎస్‌ ఆర్టీసీ వారు దూర ప్రయాణాల కోసం టికెట్లు బుకింగ్‌ను ప్రారంభించారు.

ఏప్రిల్‌ 15వ తారీకు నుండి బుకింగ్స్‌ చేసుకోవచ్చు అంటూ మూడు రోజుల క్రితం ప్రకటన చేయడంతో భారీగా బుకింగ్స్‌ అయ్యాయి.ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న వారు ప్రయాణానికి బుకింగ్‌ చేసుకున్నారు.

Advertisement

అయితే లాక్‌ డౌన్‌ను పొడగించే అవకాశం ఉండటంతో అడ్వాన్స్‌ బుకింగ్‌ మళ్లీ ఆపేశారు.అదే సమయంలో ఇప్పటి వరకు బుకింగ్‌ చేసుకున్న వారికి వారి డబ్బులు వారికి ఇవ్వబోతున్నారు.

లాక్‌ డౌన్‌ గురించి ఇంకా ఏ నిర్ణయం తీసుకోకుండానే బుకింగ్‌ ప్రారంభించడం ఏంటండీ అంత తొందర ఎందుకు అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు