YS Sharmila : ఢిల్లీలో ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ధర్నా..!

ఏపీకి ప్రత్యేక హోదా( AP Special statu ) కోసం కాంగ్రెస్ పోరుబాట పట్టింది.

ఈ మేరకు పీసీసీ చీఫ్ షర్మిల( PCC chief Sharmila ) ఢిల్లీలో ధర్నాకు దిగనున్నారు.

ప్రత్యేక హోదా అంశంతో పాటు విభజన చట్టంలోని అమలు, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ షర్మిల నిరసన కార్యక్రమం చేపట్టనునున్నారు.

మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటలకు ఢిల్లీలో( Delhi )ని ఏపీ భవన్ లో పార్టీ నేతలతో కలిసి ధర్నా చేయనున్నారు.కాగా ఢిల్లీ పర్యటనలో ఉన్న షర్మిల జాతీయ నాయకులతో సమావేశం అవుతున్నారు.ఇప్పటికే శరద్ పవార్( Sharad Pawar ) తో భేటీ అయిన షర్మిల కాసేపట్లో సీతారాం ఏచూరిని కలవనున్నారు.

సాయంత్రం 4 గంటలకు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గేతో షర్మిల సమావేశం కానున్నారు.

Advertisement
అల్లు అర్జున్ త్రివిక్రమ్ సినిమాలో ఆ స్టార్ హీరోయిన్ ను తీసుకుంటున్నారా..?

తాజా వార్తలు