కొందరు ప్రేమ ముసుగులో మనుషులను ఏమార్చి తమకు కావలసినవి చేయించుకుంటారు.డబ్బు మిగతా కోరికల వంటి కావలసినవి ఏవేనా దక్కించుకుంటారు.
ప్రేమ( Love ) పేరుతో ఇలా మనుషులే కాదు జంతువులు కూడా మోసం చేస్తాయని ఒక ఆడ సింహం నిరూపిస్తోంది.ఆ ఆడ సింహం మగసింహాన్ని ప్రేమతో మోసం చేసిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇది చూసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు.మరి కొంతమంది నవ్వుకుంటున్నారు.
లేటెస్ట్ సైటింగ్స్ అనే ప్రముఖ వైల్డ్ లైఫ్ యూట్యూబ్ ఛానెల్( Wild Life ) దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేసింది.ఒక నిమిషం నిడివి గల ఈ వీడియో క్లిప్ కు ఇప్పటిదాకా 50 వేలకు వ్యూస్ వచ్చాయి.

వైరల్ వీడియోలో ఒక పెద్ద మగ సింహం( Male Lion ) జంతువు మాంసాన్ని తింటూ ఉండటం మనం చూడవచ్చు.ఓ చెట్టు కింద కూర్చుని ఇది ప్రశాంతంగా తాజా మాంసాన్ని లాగించేస్తోంది.అయితే అది ఏ ఇతర సింహాన్ని తన దగ్గరికి రానివ్వలేదు.మరోవైపు ఓ ఆడ సింహాం( Lioness ) కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి.అందుకే అది ఆ మాంసాన్ని ఎలాగోలా దక్కించుకోవాలనుకుంది.మగసింహాన్ని భయపెట్టి మాంసం పొందడం దానివల్ల అయ్యే పని కాదు.
అందుకే అది మగ సింహాన్ని ప్రేమ మత్తులోకి దించి మాంసం తస్కరిద్దామని అనుకుంది అనుకున్న విధంగానే ప్రేమ వలకబోస్తూ మగ సింహాన్ని తన దారిలోకి తెచ్చుకుంది అనంతరం మాంసం ముందుకు వచ్చి దాన్ని నోట కరచుకొని పరిగెత్తడం మొదలుపెట్టింది దాంతో మగసింహం షాక్ అయింది.పిల్ల పోయే, మాంసం పోయే అనుకుంటూ మగసింహం దాని వెంట పడింది.

అయితే మాంసం బరువుగా ఉండటం వల్ల దానిని ఆడ సింహం ఎక్కువ దూరం లాక్కెళ్ల లేకపోయింది.దాంతో మళ్లీ మగ సింహానికే మాంసం దొరికింది.అనంతరం ఆడసింహం వైపు మగసింహం కన్నెర్ర చేసి దానిని అక్కడ నుంచి పంపించేసింది.ఈ సరదా సంఘటనను అక్కడే ఉన్న పర్యాటకులు ఫోన్ కెమెరాల్లో బంధించారు.








