రేపు ఏపీలో హైకోర్ట్ ప్రారంభం ! ఏర్పాట్లు పూర్తి

ఏపీలో మంగళవారం నుంచి కార్యకలాపాలు ప్రారంభించాల్సి ఉన్నందున ఉమ్మడి హైకోర్టు నుంచి న్యాయమూర్తులు, ఇతర సిబ్బంది అమరావతికి తరలివచ్చారు.ఈ సందర్భంగా వారికి విజయవాడలోని నోవాటెల్‌ హోటల్‌ దగ్గర ఘన స్వాగతం లభించింది.

ఉదయం 10 .30 నిముషాలకు ప్రమాణస్వీకారం కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు మంగళవారం నుంచి కార్యకలాపాలు ప్రారంభించాల్సి ఉన్న తరుణంలో ఉమ్మడి హైకోర్టు నుంచి న్యాయమూర్తులు, ఇతర సిబ్బంది అమరావతికి విచ్చేసారు.

ఉదయం 10 గంటలా 30 నిముషాలకు ప్రమాణస్వీకారం కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.హైదరాబాద్‌లోని ఉమ్మడి హైకోర్టు దగ్గర వీడ్కోలు తీసుకుని విజయవాడ చేరుకున్న న్యాయమూర్తులకు నోవాటెల్‌ హోటల్‌ దగ్గర ఏపీ బార్‌ అసోసియేషన్‌ సభ్యులు ఘనస్వాగతం పలికారు.ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఉన్నతాధికారులు వెల్ కమ్ చెప్పారు.

ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ ప్రవీణ్ కుమార్ పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.

మరో అనారోగ్య సమస్యకు గురైన సమంత... ఎమోషనల్ పోస్ట్ వైరల్!
Advertisement

తాజా వార్తలు