తెలంగాణాలో ఊహించని స్థాయిలో ఓటమి చవి చుసిన కాంగ్రెస్ పార్టీ ఇంకా తమ ఓటమిని ఒప్పుకునేందుకు … ఇష్టపడడంలేదు.కొద్ది రోజుల క్రితమే… ఈవీఎంలు ట్యాపరింగ్ అయ్యాయని… టీఆర్ఎస్ అక్రమాలకు పాల్పడింది అంటూ… కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు కూడా చేసేసింది.తాజాగా… టీఆర్ఎస్ ఎన్నికల్లో డబ్బులు వెదజల్లి, అధికార దుర్వినియోగంతో గెలిచారని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీ కుంతియా అన్నారు.
ఓట్ల తొలగింపుపై ఎన్నికల తర్వాత అధికారులు క్షమాపణ చెప్పారని ఆయన గుర్తు చేశారు.ధర్మపురి, కోదాడ, ఇబ్రహీంపట్నంలో ఎన్నికల అక్రమాలకు పాల్పడ్డారని చెప్పారు.ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అక్రమాలపై కమిటీ ఏర్పాటు చేస్తామని అన్నారు.
కలెక్టర్లపై రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ఈసీకి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.ఈవీఎంల ట్యాంపరింగ్‌పై హైకోర్టుకు వెళ్తామని కుంతియా అన్నారు.