శ్రీవారి సేవలో ఏపి డెప్యూటీ స్పీకర్ కోరగట్ల వీరభధ్రస్వామి..

గన్నవరం ఘటనలో టిడిపి మహిళలే దౌర్జన్యంకు పాల్పడ్డారని ఏపి డెప్యూటీ స్పీకర్ కోరగట్ల వీరభధ్ర స్వామి విమర్శించారు.

గురువారం ఉదయం స్వామి వారి‌ నైవేద్య విరామ సమయంలో కోరగట్ల వీరభధ్రస్వామి స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు.

దర్శనంతరం ఆయనకు రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.దర్శనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.

ప్రజాస్వామ్యంలో ప్రజలందరికి స్వేచ్ఛగా, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉన్న సమయంలో లేని అరాచకాలు సృష్టించి ప్రజాభిమానం పొందేందుకు రాజకీయ పార్టిలు ప్రయత్నం చేస్తుందన్నారు.అటువంటి రాజకీయ పార్టిలకు భగవంతుడే జ్ఞానంను ప్రసాదించాలని స్వామి వారిని వేడుకున్నట్లు చెప్పారు.

జగన్మోహన్ రెడ్డి పరిపాలన కాలంలో రాష్ట్రంలో పేదబడుగు బలహీన వర్గాలు సంతోషంగా ఉన్నారని, పాదయాత్ర చేసే వ్యక్తులకు బందోబస్తుగా పంపితే, పోలీసులు మాపై నిఘాకు వస్తున్నారని చెబుతారని, పోలీసులను బందోబస్తుకు పెట్టక పోతే మాకు రక్షణ లేదని అంటూ విమర్శలు చేస్తున్నారని, ఈ రెండు మాటలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారని, లేని జనాన్ని చూపించుకునేందుకు ఇరుగు సందుల్లో కార్యక్రమాలు నిర్వహించి తొక్కిసలాటకు కారణం అవుతున్నట్లు ఆరోపించారు.పోలీసులపైనే దౌర్జన్యాలు దిగడం, టిడిపి పార్టిలోని మహిళలకు ట్రైనింగ్ ఇచ్చి పోలీసులపైకి ఉసికొల్పడం ఘటన గన్నవరంలో చూసాంమని, ఇందుకు సంబంధించిన సీసీ పుటేజ్ ల్లో మహిళలు పోలీసులపై దౌర్జన్యం చేయడం ప్రజలంతా చూసారని, ఏ వాస్తవమో, ఏ అవాస్తవమో ప్రజలు తెలుసుసని, రాబోయే రోజుల్లో ప్రజలే వారి ఓటు హక్కు ద్వారా వారి అభిప్రాయంను తెలుపుతారని ఆయన అన్నారు.

Advertisement
బాలయ్య షోలో గేమ్ ఛేంజర్.. తండ్రి రాకపోయినా తనయుడు ఎంట్రీ ఇచ్చేశాడుగా!

తాజా వార్తలు