జగన్ తీరుపై జాతీయ మీడియా గుర్రు ?

కరోనా వైరస్ ప్రభావం కారణంగా దేశ వ్యాప్తంగా తీవ్ర ఆందోళన నెలకొంది.

రోజురోజుకి పరిస్థితి ఆందోళనకరంగా మారుతున్న తరుణంలో ఈ వైరస్ వ్యాప్తి ఎక్కువ అవుతుడడం, దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి ని నివారించేందుకు లాక్ డౌన్ ను కేంద్రం అమలు చేస్తున్నా రోజు రోజుకు కొత్త కేసులు నమోదవుతున్నాయి.

ఈ వైరస్ ను అడ్డుకునే విషయంలో అన్ని రాష్ట్రాలు బాగా టెన్షన్ పడుతున్నా ఏపీలో మాత్రం అటువంటి వాతావరణం కనిపించడం లేదు.అసలు ఈ వ్యవహారాన్ని అంత సీరియస్ గా తీసుకున్నట్లు ఏపీ ప్రభుత్వం కనిపించకపోవడం పై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.

తాజాగా ఏపీ సీఎం జగన్ నిర్వహించిన మీడియా సమావేశాన్ని పరిగణలోకి తీసుకుంటే, ఇది సాధారణ విషయమని, సాధారణ జ్వరం వలే ఇది కూడా అంటూ జగన్ వ్యాఖ్యానించడాన్ని ఇప్పుడు అందరూ తప్పు పడుతున్నారు.ముఖ్యంగా ఈ విషయంలో జాతీయ మీడియా జగన్ పై తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తుంది.ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ కరోనా విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని జాతీయ మీడియాలో అనేక కథనాలు వెలువడుతున్నాయి.

ముఖ్యంగా కరోనా వైరస్ అనేది ఒక సాధారణ డిసీజ్ అని, సాధారణ వైరస్ లాంటిదే అని కేవలం జ్వరం వచ్చినప్పుడు తీసుకునే జాగ్రత్తలు తీసుకుంటే అది పూర్తిగా తగ్గిపోతుంది అంటూ జగన్ మాట్లాడిన మాటలను జాతీయ మీడియా హైలెట్ చేస్తూ తప్పు పడుతోంది.కరోనా ను అసలు జగన్ చాలా చులకనగా తీసుకుని మాట్లాడారు.

Advertisement

కేవలం పారాసెట్మాల్ మాత్ర వేసుకుంటే తగ్గిపోతుంది అంటూ మాట్లాడిన మాటలు కూడా జాతీయ మీడియా హైలెట్ చేస్తోంది.ఇక రోజు రోజుకు ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య పెరిగి పోతున్నా, ప్రభుత్వపరంగా ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకునే నివారణ మార్గాలు పైన పెద్దగా దృష్టి పెట్టకపోవడం పై జాతీయ మీడియా జగన్ తీరును తప్పు పడుతోంది.

ఈ సందర్భంగా పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు తో జగన్ను పోలుస్తూ వారు తీసుకుంటున్న చర్యలను జగన్ తీసుకుంటున్న చర్యలను పోల్చి చూపిస్తూ కథనాలు ప్రచారం చేస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు