అమెరికాలో తెలుగు ప్రజలకు భరోసా: న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో జగన్ స్పీచ్

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ అగ్రరాజ్యం అమెరికాకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.

రోజు రోజుకి కేసుల సంఖ్య, మరణించిన వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

ఈ మహమ్మారి దెబ్బకు భారతీయులు, ముఖ్యంగా తెలుగువారు అక్కడే చిక్కుకుపోయారు.లాక్‌డౌన్‌తో పాటు ట్రావెల్ బ్యాన్ కారణంగా తెలుగు ప్రజలు తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొంటున్నారు.

ఈ నేపథ్యంలో అక్కడి తెలుగు వారిలో భరోసా నింపేందుకు ఏపీ ప్రభుత్వం వినూత్న ఆలోచన చేసింది.ప్రస్తుతం అమెరికాలోనే అత్యథిక కరోనా కేసులు నమోదైంది న్యూయార్క్‌లోనే.

ఆ దేశ వాణిజ్య రాజధానిగా, ప్రపంచ స్థాయి సంస్థలకు నిలయమైన ఈ మహానగరంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి.ఈ నేపథ్యంలో ప్రఖ్యాత న్యూయార్క్ టైమ్స్ స్వ్కేర్‌లో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీడియో సందేశాన్ని ప్రదర్శించారు.

Advertisement

‘‘ మీరు అక్కడ సురక్షితంగా, జాగ్రత్తగా ఉండండి.ఏపీలోని మీ కుటుంబసభ్యుల పట్ల మేం జాగ్రత్త వహిస్తాం’’ అంటూ సీఎం చెప్పిన సందేశాన్ని ఆ ప్రాంతంలో ప్రదర్శించారు.రాష్ట్రంలో కూడా కరోనాను నియంత్రించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని జగన్ తెలిపారు.

అదే సమయంలో అమెరికాలో తెలుగువారు కూడా ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.అమెరికాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధి పండుగాయల రత్నాకర్ సీఎం సందేశాన్ని అక్కడ ప్రదర్శించారు.

ఎన్ఆర్ఐలు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తమ వారి గురించి ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యని పలువురు ప్రశంసిస్తున్నారు.ప్రస్తుతం అమెరికాలో నమోదైన కరోనా కేసుల్లో ఒక్క న్యూయార్క్‌లోనే 93 వేలు వరకు ఉన్నాయంటే పరిస్ధితిని అర్దం చేసుకోవచ్చు.

--.

పాకిస్థానీ మహిళను ఉద్యోగం నుంచి తీసేసిన టెస్లా.. ఆ షాక్‌తో..??
Advertisement

తాజా వార్తలు