అలకలు బెదిరింపులు బుజ్జగింపులు 

ఇప్పటికే నాలుగు విడతలుగా వైసిపి( YCP ) నియోజకవర్గ ఇన్చార్జిలను ప్రకటించిన ఆ పార్టీ అధినేత జగన్( YS Jagan Mohan Reddy ) ఐదో జాబితాను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు .రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 175 నియోజకవర్గాల్లోనూ గెలిచి తీరాలనే టార్గెట్ పెట్టుకున్న జగన్ దానికి అనుగుణంగానే పెద్ద ఎత్తున సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారుస్తూ భారీ స్థాయిలో ప్రక్షాళన చేపట్టారు.

 Ap Cm Ys Jagan Mohan Reddy Meeting With Sitting Mlas , Jagan, Ysrcp, Ap,ap Elec-TeluguStop.com

గెలుపు  ప్రామాణికంగా అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు.నాలుగు విడతల్లో 58 మంది అసెంబ్లీ అభ్యర్థులను,  పదిమంది పార్లమెంట్ అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించారు.

ఐదో విడత జాబితాలో మిగతా వారిని ప్రకటించేందుకు లిస్టును రెడీ చేసుకున్నారు.దీంతో ఇంకా ప్రకటించని నియోజకవర్గాలకు చెందిన ఆశావాహులు , సిట్టింగ్ ఎమ్మెల్యే లు పెద్ద ఎత్తున తాడేపల్లి క్యాంపు కార్యాలయంకు చేరుకుంటూ జగన్ ను కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు.

Telugu Ap, Jagan, Mlas, Tadepalle, Ysrcp, Ysrcp Mlas-Politics

 మళ్లీ తమకు అవకాశం కల్పించాలని సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఈసారైనా తమకు అవకాశం ఇవ్వాలని ఆశావాహులు జగన్ కు విజ్ఞప్తులు చేస్తున్నారు.సీటు దక్కే అవకాశం లేని వారిని ముందుగానే తాడేపల్లి క్యాంప్ కార్యాలయం( Tadepalle )కు పిలిపించుకుని జగన్ బుజ్జగింపులు చేస్తున్నారు.తప్పనిసరి పరిస్థితుల్లో తాము ఈ మార్పు చేర్పులకు శ్రీకారం చుట్టామని,  కొత్తగా ప్రకటించబోయే అభ్యర్థికి అన్ని విధాలుగా సహకరించాలని , మళ్లీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత మీకు సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇస్తున్నారు.మరికొంతమందికి తప్పనిసరి పరిస్థితుల్లో వేరే నియోజకవర్గానికి మిమ్మల్ని మార్చాల్సి వచ్చిందని చెబుతున్నారు .ఈ విధంగా కొంతమందికి నచ్చ చెబుతుండగా,  మరి కొంత మందికి సీటు లేదని,  అధికారంలోకి వచ్చిన వెంటనే నామినేటెడ్ పదవులు ఇస్తామని చెబుతున్నారట.

Telugu Ap, Jagan, Mlas, Tadepalle, Ysrcp, Ysrcp Mlas-Politics

కొంతమంది ఈ విషయంలో సానుకూలంగా స్పందిస్తున్నా,  మరికొంతమంది తనకు సీటు ఇవ్వకపోతే పార్టీ మారేందుకు కూడా  సిద్దమనే సంకేతాలు ఇస్తున్నారట.సీటు దక్కే అవకాశం లేనివారు బెదిరింపులకు పాల్పడుతుండగా,  వారిని బుజ్జగించేందుకు పార్టీలోని కీలక నేతలను జగన్ రంగంలోకి దించారు .వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా గెలవాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నామని … ప్రస్తుత పరిస్థితిని అర్థం చేసుకోవాలంటూ చెబుతూనే,  కచ్చితంగా రాబోయే ఎన్నికల్లో గెలిచేది వైసీపీనేనని,  రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అందరికీ న్యాయం చేస్తామని , మీ త్యాగాలు వృధాగా పోవని నచ్చ చెబుతున్నారట.ఐదేళ్లపాటు నియోజకవర్గానికి దూరంగా ఉండలేమని, రాజకీయంగా వెనకబడి పోతామని తమ వాదనను వినిపిస్తున్నారట .నిన్న తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి చాలా మంది పార్టీ ఎమ్మెల్యేలు, ఆశావాహులు చేరుకుని జగన్ ను కలిసి తమ గోడు చెప్పుకున్నారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube