ముహూర్తం మారింది ! విశాఖకు జగన్ మకాం ఎప్పుడంటే ?

మూడు రాజధానుల ప్రకటన ఎప్పుడో చేసిన వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్( CM Jagan ) విశాఖ నుంచి పరిపాలన మొదలు పెట్టేందుకు చాలా కాలంగా ముహూర్తాలు పెట్టుకుంటున్నారు.

తాడేపల్లి నుంచి విశాఖకు మకాం మార్చాలని ఎప్పటి నుంచో భావిస్తున్నారు.

అయితే ఎప్పటికప్పుడు ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉండడంతో,  ఎప్పటికప్పుడు అది వాయిదా పడుతూ వస్తోంది.గతంలో శ్రీకాకుళం లో జరిగిన ఓ బహిరంగ సభలో సెప్టెంబర్ నుంచి విశాఖలోనే( Vishakapatnam ) మకాం ఉండబోతున్నానని జగన్ ప్రకటించారు.

అయితే కొన్ని రకాల ఇబ్బందుల నేపథ్యంలో,  వచ్చే దసరాకు విశాఖకు షిఫ్ట్ అవ్వాలని జగన్ తాజాగా నిర్ణయించుకున్నారు.ఈ మేరకు విశాఖలో సీఎం క్యాంప్ ఆఫీసు పనులు జరుగుతున్నాయి.

దసరా నాటికి పూర్తిగా సిద్ధం చేసే విధంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Advertisement

అలాగే భద్రత ఏర్పాట్లను పరిశీలించి దానికనుగుణంగా నిర్మాణాలు చేపడుతున్నారు.అధికారికంగా విశాఖను రాజధానిగా ప్రకటించి అక్కడి నుంచే కార్యకలాపాలు చేపడుదామని జగన్ ఆలోచిస్తున్నా,  రాజధానుల వ్యవహారం( AP Capital ) కోర్టులో ఉండడంతో జగన్ ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు .అయితే అనాధికారికంగా అయినా విశాఖ నుంచి పరిపాలనను కొనసాగిస్తే అదే రాజధానిగా ప్రజలు గుర్తిస్తారని జగన్ బలంగా నమ్ముతున్నారు.అందుకే తన నివాసాన్ని విశాఖలోనే ఏర్పాటు చేసుకుని పరిపాలనను మొదలు పెట్టేందుకు దసరాను ముహూర్తంగా నిర్ణయించుకున్నారు.

ఈ విధంగానైనా తన నిర్ణయాన్ని అమలు చేసి వచ్చే ఎన్నికల్లో ఇబ్బందులు లేకుండా చూసుకునే విధంగా జగన్ ప్లాన్ చేస్తున్నారు.ఎన్నికల కంటే ముందుగానే తాను విశాఖకు మకాం మార్చితే తన పంతం కూడా నెరవేరినట్లు అవుతుందని, జనాల్లోనూ జగన్ అనుకున్నది సాధించారనే అభిప్రాయాలు కలుగుతాయని అంచనా వేస్తున్నారు.కోర్టుల వ్యవహారం లేకపోతే ఎప్పుడో అధికారికంగా పరిపాలన రాజధాని గా విశాఖను , న్యాయ రాజధానిగా కర్నూల్ ను,( Kurnool )  శాసన రాజధానిగా అమరావతిని( Amaravati ) ఏర్పాటుచేసి జగన్ తన పంతాన్ని నెరవేర్చుకునేవారు.

కానీ కోర్టు చిక్కులతో ఈ రకమైన పరిస్థితి తలెత్తడంతోనే  విశాఖకు మకాం మార్చి అక్కడ నుంచి పరిపాలనను మొదలుపెట్టి సంతృప్తి చెందే విధంగా జగన్ అడుగులు వేస్తున్నారు.

అల్లు అర్జున్ అరెస్టు పెద్ద కుట్ర ఉంది.. సింగర్ కల్పన షాకింగ్ కామెంట్స్?
Advertisement

తాజా వార్తలు