మరో శ్వేతపత్రం :  వైసీపీని టార్గెట్ చేసేలా చంద్రబాబు వ్యూహం  

ఏపీలో అధికార పీఠంపై ఎక్కిన దగ్గర నుంచి టిడిపి అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు( CM Chandrababu Naidu ) వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.

ప్రస్తుతం టిడిపి( TDP ) ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు పై పదే పదే వైసిపి( YCP ) నిలదీస్తూ ప్రజలలో చులకన చేసే విధంగా వ్యవహరిస్తుండడం తదితర పరిణమల నేపథ్యంలో చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.

గత వైసిపి ప్రభుత్వ పాలనలో వ్యవస్థలన్నీ దెబ్బతిన్నాయని ప్రచారం చేస్తుండడంతో పాటు,  శ్వేత పత్రాలను విడుదల చేస్తున్నారు.ఇప్పటికే మూడు అంశాలపై శ్వేత పత్రాలను విడుదల చేశారు.

మరో వారం రోజుల్లో ఆర్థిక శాఖ పై పత్రం విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు .ఏపీకి 14 లక్షల కోట్లకు పైగా అప్పులు ఉన్నాయని ఆర్థిక శాఖ సమీక్షలో సీఎం కి అధికారులు వివరించారు .ఇప్పటికే పోలవరం, అమరావతి ,విద్యుత్ రంగంపై మూడు శ్వేత పత్రాలను చంద్రబాబు విడుదల చేయగా,  మరో శ్వేత పత్రం విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు.

ఈనెల 18న ఆర్థిక శాఖ పై శ్వేత పత్రం విడుదల చేసేందుకు నిర్ణయించుకున్నారు.ఐదేళ్ల వైసిపి ప్రభుత్వంలో తీసుకువచ్చిన రుణాలతో రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని ఇప్పటికే చంద్రబాబు విమర్శలు చేస్తున్నారు .రాష్ట్రానికి ఉన్న ఆదాయం,  అప్పుల లెక్కలను ఆర్థిక శాఖ( Finance Ministry ) అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు చంద్రబాబు.  2019 - 24 మధ్యకాలంలో ప్రభుత్వం చేసిన అప్పులు,  ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ తోపాటు,  కార్పొరేషన్ పేరిట తీసుకున్న రుణాల పైన చంద్రబాబు అధికారులను ఆరా తీశారు.

Advertisement

  ఇప్పటివరకు అన్ని రకాల అప్పులు కలిపి 14 లక్షల కోట్లకు పైగా ఉన్నట్లు ఆర్థిక శాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేసినట్లు సమాచారం .ఏ శాఖలో ఎంత ఖర్చు చేశారు ?  ఏ శాఖల నిధులు ఇతర పనులకు మళ్లించారు అనేది కూడా పూర్తిగా వివరాలు ఇవ్వాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు.దీంతోపాటు పెండింగ్ బిల్లులు( Pending Bills ) ఎంత ఉన్నాయి అనే దానిపైన చంద్రబాబు అధికారులను అడిగి తెలుసుకున్నారు.

రాష్ట్రానికి వస్తున్న రెవెన్యూ , కేంద్రం నుంచి రావాల్సిన గ్రాండ్లు, రాష్ట్ర ప్రభుత్వ మ్యాచింగ్ నిధుల కేటాయింపు పై కూడా చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.  కేంద్ర నిధులపై నిత్యం ఆయా కేంద్ర మంత్రిత్వ శాఖలతో సంప్రదింపులు జరపాలని అధికారులను ఆదేశించారు.  గత ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు కారణంగా ఏపీ పరిస్థితి దారుణంగా దెబ్బతింది అనే విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా శ్వేతపత్రం రూపొందించాలని ఆర్థిక శాఖ అధికారులకు చంద్రబాబు సూచించారు.

Advertisement

తాజా వార్తలు