వీడియో వైరల్: నేషనల్ హైవేపై ఒక్కసారిగా విరిగిపడ్డ కొండ చరియలు..

ప్రస్తుతం వానకాలం నేపథ్యంలో కొన్ని ప్రాంతాలలో వానలు జోరుగా కురుస్తున్నాయి.ఈ క్రమంలో ప్రస్తుతం ఉత్తరాఖండ్ లో( Uttarakhand ) భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.

 Massive Landslide Near Patalganga Langsi Tunnel Blocks Badrinath National Highwa-TeluguStop.com

ఇందులో భాగంగానే తాజాగా జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున కొండ చరియలు( Landslide ) విరిగిపడి రాకపోకలకు అంతరాయం కలిగింది.దాంతో కొన్ని గంటల పాటు ట్రాఫిక్ జామ్ భారీగా నిలిచిపోయింది.

రాష్ట్రంలోని చెలిమి జిల్లాలోని బద్రీనాథ్ జాతీయ రహదారిపై( Badrinath National Highway ) భారీ వర్షాలకు గాను ఒక్కసారిగా పెద్దఎత్తున కొండ చర్యలు విరిగిపడిపోయాయి.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

గత కొన్ని రోజులుగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తూ ఉండడంతో కొండ ప్రాంతాలలో ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి.ఇలా కొండ చర్యలు రహదారిపై పడడంతో పాక్షికంగా రహదారులు ధ్వంసమై పలు గ్రామాలకు రాకపోకలు లేకుండా చేశాయి.జోషిమఠ్‌ లోని విష్ణు ప్రయాగ్ నది( Vishnu Prayag River ) కూడా ఇంతే ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.అలాగే రాష్ట్రంలోని పలు చోట్ల అయితే వరదలతో నదులు ఉదృతంగా ప్రవహిస్తూ ప్రజలకు ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.

ఇలా చమోలి వద్ద రెండు చోట్ల కొండ చర్యలు విరిగి పడడంతో బద్రీనాథ్ హైవే బ్లాక్ అవ్వడంతో స్థానికులు ప్రజలను ఎక్కడికక్కడే నిలిచిపోవాలని సూచించారు.ఇది ఇలా ఉండగా.

హైదరాబాద్ కు చెందిన ఇద్దరు టూరిస్ట్ లు కొండ చర్యలు విరిగిపడడంతో అక్కడికక్కడే వారు ప్రాణాలు విడిచారు.

ఈ నేపథ్యంలోనే వాతావరణం అనూకలించక పోవడంతో ఛార్ ధమ్ యాత్రను ఓ రోజు పాటు నిలిపివేసిన సంగతి తెలిసిందే.ఆపై ఆ ఆంక్షల్ని ఎత్తి వేశారు అధికారులు.కాబట్టి ప్రజలు ఎవరైనా ఛార్ ధమ్ యాత్ర చేసేవారు ఉంటె జాగరతలు తీసుకోని వెళితే మేలు.

లేకపోతే లేనిపోని ఇబ్బందులకు గురి అవ్వాల్సి ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube