డేటా చోరీ చేసులో సిఈసీకి ఫిర్యాదు చేసిన బీజేపీ!

ఏపీలో ఓటర్స్ డేటా చోరీ వ్యవహారం ఇప్పుడు రాజకీయాలలో తారాస్థాయికి చేరుకుంది.

ఓ వైపు టీడీపీ, వైసీపీ పార్టీలు డేటా చోరీ వ్యవహారంలో ఓట్ల తొలగింపు కుట్రకి తెరతీసింది మీరంటే, మీరు అని విమర్శలు చేసుకుంటూ కేసులు పెట్టుకున్నారు.

ఈ నేపధ్యంలో ఇప్పుడు డేటా చోరీ కేసుల వ్యవహారంలో అటు తెలంగాణ, ఇటు ఆంధ్రాలో సిట్ ల విచారణకి ప్రభుత్వాలు ఆదేశించాయి.ఫారం 7 ద్వారా ఓట్ల తొలగింపు కుట్రకి తెరతీసారని ఆరోపణలు వైసీపీ ఎదుర్కొంటూ వుంటే, ఐటీ గ్రిడ్ మాటున డేటా చోరీకి తెలుగుదేశం పార్టీ ప్రయత్నం చేస్తుందని టీడీపీ ఆరోపణలు ఎదుర్కొంటుంది.

ఇదిలా వుంటే ఇప్పుడు ఈ డేటా చోరీపై తాజాగా బీజేపీ పార్టీ కేంద్ర ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేసింది.తెలుగు దేశం పార్టీ ఏపీలో ప్రజల ఓట్లని తొలగించే కుట్ర చేసి అడ్డదారిలో గెలవాలని ప్రయత్నం చేస్తుందని సిఈసికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ నేతృత్వంలో ఫిర్యాదు చేసారు.

ఇక ఏపీలో తెలుగుదేశం పార్టీ గత సంవత్సరం లక్షల్లో ఓట్లు తొలగించి దొంగ ఓట్లు నమోదు చేయించింది అని ఆరోపణలు చేసారు.మరో వైపు ఏపీలో ఈ డేటా చోరీ వ్యవహారం ఎన్నికల సంఘంకి కూడా ప్రస్తుతం తీవ్ర తలనొప్పిగా మారింది అని చెప్పాలి.

Advertisement

దీనిపై ఎలక్షన్ కమిషన్ ఎలా ముందుకి వెళ్తుంది అనేది చూడాలి.

ఇప్పుడైనా జగన్ ను విమర్శిస్తారా ? మోది టూర్ పై కూటమి నేతల ఆశలు
Advertisement

తాజా వార్తలు