జూనియర్ ఎన్టీఆర్ ను కన్ఫ్యూజ్ చేస్తున్న వైసీపీ !

తెలుగుదేశం పార్టీలో ఎప్పటికైనా కీ రోల్ పోషించే అవకాశం ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ను ఇప్పుడు వైసీపీ గందరగోళంలో పడేస్తోంది.

ఇటీవల ఆయన మామ నార్నె శ్రీనివాసరావు కొద్ది రోజుల క్రితం లోటస్ పాండ్ కు వెళ్లి వైసీపీలో చేరిపోయారు.

తాను పదవి ఆశించి పార్టీలోకి వెళ్ళలేదు అని జగన్ నిర్ణయం ప్రకారం తన రాజకీయ భవిష్యత్తు ఉండబోతోందని ఆయన ప్రకటించారు.తాను ఎక్కడా సీటు ఇవ్వమని అడగలేదు అని చెప్పుకొచ్చాడు.

అయితే గుంటూరు పార్లమెంట్ సీటు కానీ , చిలకలూరిపేట అసెంబ్లీ టికెట్ కానీ ఇవ్వాల్సిందిగా జగన్ ను నార్నే కోరినట్టు పార్టీలో చర్చ జరుగుతోంది.అయితే జగన్ మాత్రం ఆయనను అద్దంకి నుంచి పోటీ చేయమని చెప్పినట్టు సమాచారం.

కాకపోతే అద్దంకిలో బలమైన ప్రత్యర్థిగా ఉన్న గొట్టిపాటి రవి కుమార్ ను రాజకీయంగా ఎదుర్కోవడం అంటే అది జరగనిపనని కోరి ఓటమి ఎందుకు తెచ్చుకోవడం ఎందుకని నార్నే ఆందోళన చెందుతున్నాడు.గత ఎన్నికలలో కూడా నార్నే వైసీపీ నుంచి పోటీ చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.అప్పుడే ఎన్టీఆర్ మీద అనేక విమర్శలు చెలరేగాయి.

Advertisement

కావాలనే తన మామను వైసీపీలోకి పంపారని వార్తలు రావడంతో అప్పట్లో ఆయన వెనక్కి తగ్గారు.

హరికృష్ణ మరణం అనంతరం ఎన్టీఆర్ నందమూరి కుటుంబానికి కాస్త దగ్గరయ్యారు.ఆయనకు బాలయ్య కుటుంబానికి కొంత రాకపోకలు పెరిగాయి.అయితే ఆయన పార్టీకి మాత్రం దూరంగానే ఉంటున్నారు.

ఇటీవలే ఆయన అక్క నందమూరి సుహాసిని కూకట్ పల్లిలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తే జూనియర్ ప్రచారానికి కూడా వెళ్ళలేదు.ఇప్పుడు నార్నేకు టికెట్ ఇస్తే వైసీపీకి అనుకూలంగా ప్రచారం చెయ్యాలని జూనియర్ మీద ఒత్తిడి పెరుగుతోంది.

దీంతో ఈ అంశంపై జూనియర్ ముందుకు వెనక్కు వెళ్లలేని పరిస్థితుల్లో ఉన్నాడు.ఇక నార్నేకు కూడా జగన్ శిబిరం నుంచి ఒత్తిడి పెరుగుతోంది.ఎట్టి పరిస్థితుల్లోనైనా జూనియర్ ను ప్రచారానికి వచ్చేలా ఒప్పించాలని షరతులు పెడుతున్నారట.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
సొంత ఇంటి కల నెరవేర్చుకున్న బిగ్ బాస్ బ్యూటీ శోభ.. ఫోటోలు వైరల్!

అప్పుడే నార్నే కోరిన చోట సీటు ఇవ్వాలని వైసీపీ భావిస్తోందట.కానీ జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి వ్యతిరేకంగా ప్రచారం చేసే అవకాశమే లేదని ఆయన సన్నిహితులు కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు