న్యూస్ రౌండప్ టాప్ 20

1.మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్న పిటిషన్ పై హైకోర్టులో విచారణ

తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్( Srinivas Goud Petition ) అనర్హత పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది.

19.11.2018 దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్ ఆధారంగానే విచారణ కొనసాగింది.

2.టిఆర్ఎస్ పై టీటీడీపీ విమర్శలు

వరదలతో నష్టపోయిన వారిని ఆదుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని తెలంగాణ టిడిపి అధ్యక్షుడు జ్ఞానేశ్వర్ విమర్శించారు.

3.మహిళ కమిషన్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

ఏపీ మహిళా కమిషన్ కార్యాలయం వద్ద ఉద్రత నెలకొంది.జనసేనకు చెందిన మహిళలు వాసిరెడ్డి పద్మను కలిసేందుకు ఆమె కార్యాలయం వద్దకు రాగా,  కార్యాలయం సమీపంలో పోలీసులు వారిని అడ్డుకొని అరెస్ట్ చేశారు.

4.విశాఖకు జగన్

వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్( CM jagan ) రేపు విశాఖలో పర్యటించనున్నారు.

5.పీకే వ్యూహం తో ఏపీలో రక్షణ కరువు

ప్రశాంత్ కిషోర్ వ్యూహంతో ఏపీలో రక్షణ కరువైందని టిడిపి నేత పోలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమ విమర్శించారు.

6.అసైన్డ్ భూములు పేదలకే దక్కాలి

అసైన్డ్ భూములు పేదలకు దక్కేలా చర్యలు చేపట్టాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ డిమాండ్ చేశారు.

7.తిరుమల సమాచారం

Advertisement

తిరుమలలో( Tirumala ) భక్తుల రద్దీ తక్కువగా ఉంది.టోకెన్ రహిత సర్వదర్శనం కోసం ఒక కంపార్ట్మెంట్ లలో మాత్రమే భక్తులు వేచి ఉన్నారు.

8.ఆగస్టు 5 నుంచి ఈసా గ్రామోత్సవం

గ్రామీణ భారత క్రీడా స్ఫూర్తి సంస్కృతిని పునర్జీవింప చేసేందుకు 2004లో సద్గురు ఈసా గ్రామోత్సవం ప్రారంభించబడింది .దీనిలో భాగంగా దక్షిణ భారతదేశ వ్యాప్తంగా జరగనున్న ఈ పోటీలు ఆంధ్రప్రదేశ్ లో ఆగస్టు 5న ప్రారంభం కానున్నాయి.

9.టూరిజం బోట్ బోల్తా

రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థకు చెందిన స్పీడ్ బోట్ విశాఖ సమీపంలో సముద్రంలో బోల్తా పడింది.బోటులో ఉన్న ఇద్దరు పర్యాటకులు,  డ్రైవర్ నీటిలో పడిపోయారు.వారు లైఫ్ జాకెట్లు ధరించి ఉండటంతో ప్రాణాపాయం తప్పింది.

10.అప్ గ్రేడేషన్ కు పదకొండు రైల్వేస్టేషన్ లు ఎంపిక

విజయవాడ రైల్వే డివిజన్( Vijayawada Railway Division ) లో 11 రైల్వే స్టేషన్లను అప్ గ్రేడేషన్ కు ఎంపిక చేసినట్లు విజయవాడ రైల్వే డివిజన్ మేనేజర్ నరేంద్ర ఆనంద్ పాటిల్ తెలిపారు.

11.శ్రీవారి సేవలు జస్టిస్ గోపాలకృష్ణరావు

ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గోపాలకృష్ణ రావు తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.

12.ఐటీ కారిడార్ లో మహిళలకు ప్రత్యేక బస్సు

హైదరాబాద్ నగరంలోని ఐటీ కారిడార్ లో మహిళల కోసం ప్రత్యేక బస్సులు నడపాలని టిఎస్ఆర్టిసి నేడు నిర్ణయించింది.

13.47 కొండచిలువల పట్టివేత

తిరుచి అంతర్జాతీయ విమానాశ్రయంలో 47 కొండచిలువలను అక్రమంగా తరలిస్తున్న ఓ  వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.

14.తగ్గుముఖం పట్టిన గోదావరి

భద్రాచలం( వద్ద గోదావరి తగ్గుముఖం పట్టింది.సోమవారం ఉదయం 6 గంటలకు 47.6 అడుగులకు చేరుకోవడంతో రెండో ప్రమాద హెచ్చరికను అధికారులు ఉపసంహరించుకున్నారు.

15.నటుడు పృథ్వీరాజ్ కామెంట్స్

అంబటి రాంబాబు ఎవరు తనకు తెలియదని బ్రో సినిమా శ్యాంబాబు వివాదంపై సినీ నటుడు పృధ్వీరాజ్ కామెంట్ చేశారు.

16.తెలంగాణకు వర్ష సూచన

తెలంగాణ లో మరో మూడు రోజులు వర్షాలు పడనున్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

17.నేడు తెలంగాణ మంత్రివర్గ సమావేశం

తెలంగాణ సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈరోజు సాయంత్రం క్యాబినెట్ సమావేశం జరగనుంది.ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకొనున్నారు.

18.ఎంపీ అరవింద్ కార్యాలయం ముందు నిరసన

నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కార్యాలయం ముందు సొంత పార్టీ నాయకులు కార్యకర్తలు ధర్నాకు దిగారు.ఇటీవల 13 మండలాల బిజెపి అధ్యక్షులను మారుస్తూ అరవింద్ నిర్ణయం తీసుకోవడంతో వారు ధర్నాకు దిగారు.

19.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శలు

జాతీయ అవార్డును పునీత్ రాజ్ కుమార్ కు అంకితం చేసిన రిషబ్ శెట్టి.. ఏం జరిగిందంటే?
వీళ్లకు వేరే సినిమాల వల్లే హిట్ సినిమాల్లో ఛాన్సెస్ వచ్చాయి..?

అసైన్డ్ భూములలో ఎవరి ఫామ్ హౌస్ లో ఉన్నాయో బయటపెట్టాలని బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్( R.S.Praveen Kumar ) డిమాండ్ చేశారు.

20.మహిళలకు 0 వడ్డీ కార్యక్రమం

ఏపీలో మహిళలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది.

Advertisement

ఆగస్టు 10 న మహిళలకు 0 వడ్డీ కార్యక్రమం నిర్వహించాలని ఏపీ సీఎం జగన్ నిర్ణయించారు .

తాజా వార్తలు