న్యూస్ రౌండప్ టాప్ 20

1.  ప్రతిపక్షాలపై హరీష్ రావు  కామెంట్స్

ఏరు దాటే దాకా ఓడ మల్లన్న వేరు దాకా బోడి మల్లన్న అన్నట్లుగా ప్రతిపక్షాలు  వ్యవహరిస్తున్నాయని మంత్రి హరీష్ రావు విమర్శించారు.

2.ఉత్తర తెలంగాణకు భారీ వర్ష సూచన

తెలంగాణకు మరోసారి వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది .రానున్న మూడు రోజుల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

3.బీఆర్ఎస్ లోకి తెల్లం వెంకట్రావు

 ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ నేత మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అనుచరుడు తెల్లం వెంకట్రావు బీఆర్ఎస్ లో చేరారు.ఆయనకు మంత్రి కేటీఆర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

4.కృష్ణాజిల్లాలో లోకేష్ పాదయాత్ర

ఈనెల 19 ఉమ్మడి కృష్ణాజిల్లాలో టిడిపి యువ నేత నారా లోకేష్ పాదయాత్ర చేయనున్నారు.

5.వైసిపి పై సోమిరెడ్డి విమర్శలు

సిలికా ద్వారా వైసీపీ నాయకులు కోట్లు గడిస్తున్నారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు.

6.ప్రముఖ జర్నలిస్టు కృష్ణారావు మృతి

జర్నలిజం రంగంలో 47 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న ప్రముఖ జర్నలిస్టు సిహెచ్ఎంవి కృష్ణారావు ఈరోజు మృతి చెందారు.ఏడాది కాలంగా క్యాన్సర్ తో ఆయన పోరాడుతున్నారు.

7.రాహుల్ గాంధీ ఆగ్రహం

Advertisement

భారతదేశ తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ , కీర్తి ప్రతిష్టలు రావడానికి కారణం ఆయన చేసిన కృషి అని కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ అన్నారు.ఢిల్లీలోని నెహ్రూ మ్యూజియం పేరును ప్రధాన మంత్రుల నియోజకవర్గంగా మార్చడం పై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

8.సర్పంచ్ లతో చంద్రబాబు సమావేశం

అంబేద్కర్ కోనసీమ జిల్లాలో టిడిపి అధినేత చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది.గురువారం ఉదయం మండపేటలో పర్యటించిన చంద్రబాబు ఈ సందర్భంగా సర్పంచ్ ల సమావేశం నిర్వహించారు.

9.అంబేద్కర్ వర్సిటీలో ప్రవేశాలకు గడువు పెంపు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సార్వత్రిక లయంలో డిగ్రీ, పలు డిప్లమో సర్టిఫికెట్ కోర్సులు చేరేందుకు గడువును సెప్టెంబర్ 5 వరకు పెంచినట్లు యూనివర్సిటీ అధికారులు తెలిపారు.

10.ఎన్నికలపై ఫోకస్ పెట్టిన కిషన్ రెడ్డి

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ బిజెపి రాష్ట్ర కమిటీ లో మార్పు, చేర్పులపై కసరత్తు నిర్వహించారు.

11.టిడిపి మాజీ ఎమ్మెల్యే ఇంటి వద్ద ఉద్రిక్తత

టిడిపి మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఇంటి వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది.సౌమ్య ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు.జిల్లాలో మహాత్మా గాంధీ, ఎన్టీఆర్ విగ్రహాలతో సంబంధించి మున్సిపల్ కార్యాలయంలో వినతి పత్రం ఇచ్చి నిరసన తెలపడానికి బయలుదేరిన సౌమ్యను పోలీసులు అడ్డుకున్నారు.

12.కోమటిరెడ్డి పై గుత్తా విమర్శలు

భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పై శాసనమండలి చైర్మన్ గుత్తా ఉపేందర్ రెడ్డి విమర్శలు చేశారు.కోమటిరెడ్డి సన్యాసం తీసుకో ఇదే సరైన సమయం అంటూ గుత్తా సెటైర్లు వేశారు.

13.మళ్లీ కొత్తగూడెం నుంచి పోటీ చేస్తా

మళ్లీ తాను కొత్తగూడెం నుంచి పోటీ చేస్తానని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తెలిపారు.

14.వంద కోట్లు ఇస్తే రాజీనామా చేస్తా :జెసి

తాడిపత్రి బాగు కోసం 100 కోట్లు మంజూరు చేస్తే తాను చైర్మన్ గా రాజీనామా చేస్తానని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి సవాల్ విసిరారు.

15.తిరుమలలో కొనసాగుతున్న ఆపరేషన్ చిరుత

బాలయ్య టాక్ షోకు పోటీగా రానా టాక్ షో.. ఆ ప్రముఖ షోకు హాజరయ్యే గెస్టులు వీళ్లే!
వయనాడ్ ఎన్నికల బరిలోకి నవ్య హరిదాస్.. అసలు ఎవరు ఈమె..?

తిరుమలలో మరికొద్ది రోజులపాటు ఆపరేషన్ చిరుత కొనసాగుతుందని సీసీఎఫ్ నాగేశ్వరావు తెలిపారు.

16.తుంగభద్ర కాలువకు నీరు విడుదల

తుంగభద్ర కాలువలకు నవంబర్ 30 వరకు నీటిని వదలాలని తుంగభద్ర నీటి పరదాలలో సలహా సమితి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

17.నటుడు ఉపేంద్ర కేసు విచారణ వాయిదా

Advertisement

నటుడు ఉపేంద్ర తనపై దాఖలైన ఎఫ్ఐఆర్లను రద్దు చేయాలంటే హైకోర్టులో వేసిన పిటీషన్ పై విచారణ వాయిదా పడింది.

18.తిరుమల లో చిక్కిన మరో చిరుత

తిరుమల నరసింహ స్వామి ఆలయానికి సమీపంలో ఏర్పాటు చేసిన బోనులో మరో చిరుత చిక్కింది.గతంలో బాలికపై దాడి చేసిన ప్రదేశానికి సమీపంలోనే బోనులో చిరుత చిక్కింది.

19.ఖమ్మం లో అగ్ని నియామక ర్యాలీ

వచ్చే నెల 1 నుంచి ఖమ్మంలో అగ్ని వీర్ సైన్యం నియామక ర్యాలీ జరగనుంది.

20.రఘురామ సెటైర్లు

తిరుమలలో కాలినడకన వెళ్లే భక్తులకు గొడ్డలో, కోడి కత్తో ఇస్తారేమో అంటూ వైసిపి రెవెల్ ఎంపీ రఘురాం కృష్ణంరాజు సెటైర్లు వేశారు.

తాజా వార్తలు