News Roundup: న్యూస్ రౌండప్ టాప్ 20 

1.మహేష్ బాబుకు జగన్ ఓదార్పు

పద్మాలయ స్టూడియోకు ఏపీ సీఎం జగన్ చేరుకున్నారు కృష్ణ పార్థివదేహానికి జగన్ నివాళులర్పించి మహేష్ ను ఓదార్చారు.

 

2.గ్రూప్ వన్ లో ఐదు ప్రశ్నలు తొలగింపు

  గ్రూప్ వన్ ప్రాథమిక పరీక్షలు ఐదు ప్రశ్నలను పూర్తిగా తొలగించాలని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్ణయించింది. 

3.అమరావతి భూములు కొనుగోలు పై సుప్రీం లో విచారణ

 

అమరావతి భూముల కొనుగోలు వ్యవహారంపై ఏర్పాటులో సుప్రీం కోర్టులో విచారణ ప్రారంభమైంది. 

4.జగనన్న కాలనీలకు వెళ్లే అర్హత పవన్ కు లేదు

  సామాజిక తనిఖీల పేరుతో జగనన్న కాలనీలకు వెళ్లే అర్హత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు, ఆ పార్టీ నాయకులకు లేదని ఏపీ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. 

5.పోలవరం ప్రాజెక్టు అథారిటీ భేటీ

 

సి డబ్ల్యూ సి ఆఫీస్ లో పోలవరం ప్రాజెక్టు అథారిటీ బుధవారం భేటీ అయింది. 

6.మరో 17 మెడికల్ కాలేజీలు

  తెలంగాణలోని అన్ని జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.ఈ మేరకు కొత్తగా 17 కాలేజీల ఏర్పాటుకు మంత్రిమండలి ఆమోదం తెలిపినట్టు టిఆర్ఎస్ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. 

7.19 , 20 తేదీల్లో పలు రైళ్ల రద్దు

 

Advertisement

ఈనెల 19 , 20 తేదీల్లో ట్రాఫిక్ పవర్ బ్యాక్ కారణంగా పలు రైలు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. 

8.తిరుమల సమాచారం

  తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.నిన్న తిరుమల శ్రీవారి ని 71,461 మంది భక్తులు దర్శించుకున్నారు. 

9.ఎమ్మెల్యేల కొనుగోలు కేసు హైకోర్టులో విచారణ

 

మొయినాబాద్ ఫామ్ హౌస్ లో టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై హైకోర్టులో విచారణ ప్రారంభం అయ్యింది. 

10.నేడు తెరుచుకోనున్న శబరిమల ఆలయం

 శబరిమల అయ్యప్ప ఆలయం నేడు తెరుచుకోనుంది. 

11.కర్నూలు జిల్లాలో చంద్రబాబు పర్యటన

 

టిడిపి అధినేత చంద్రబాబు ఈరోజు కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు.నేటి నుంచి మూడు రోజులు పాటు ఆయన కర్నూలు జిల్లాలోని అనేక ప్రాంతాల్లో పర్యటిస్తారు. 

12.కృష్ణ అంత్యక్రియలు

 సినీ సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు నేడు మహాప్రస్థానంలో ప్రభుత్వ అధికారిక లాంచనాలతో జరుగుతున్నాయి. 

13.నేడు సినీ పరిశ్రమ బంద్

 

తెలుగు సూపర్ స్టార్ కృష్ణ మృతికి సంతాపంగా నేడు సినీ పరిశ్రమ బంద్ పాటిస్తోంది. 

14.ఆర్జిత సేవా టికెట్లు

  ఈరోజు ఉదయం 10 గంటలకు టిటిడి ఆర్జిత సేవా టికెట్లను ఆన్లైన్ లో విడుదల చేసింది. 

15.నేడు కర్నూలులో మానవహారం

 

ఇదేం ఫ్యాషన్ రా బాబోయ్.. బబుల్ ర్యాప్‌తో డ్రెస్ అట.. ధర తెలిస్తే అంతే!
బాలయ్య షోలో గేమ్ ఛేంజర్.. తండ్రి రాకపోయినా తనయుడు ఎంట్రీ ఇచ్చేశాడుగా!

కర్నూలు న్యాయ రాజధాని చేయాలని కోరుతూ విద్యార్థులు నేడు మానవహారం చేపట్టనున్నారు.ఈ కార్యక్రమానికి వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. 

16.రాయలసీమ రెవెన్యూ సదస్సు

నేడు తిరుపతిలో రాయలసీమ రెవెన్యూ సదస్సును ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు హాజరు కానున్నారు. 

17.చిత్తూరు జిల్లాలో స్వల్ప భూకంపం

 

Advertisement

చిత్తూరు జిల్లా పలమనేరు పరిసర ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించింది. 

18.అచ్చెన్నాయుడు కామెంట్స్

  రాయతీ లు ఎత్తివేసి ప్రజలను జే టాక్స్ తో జగన్ దోచుకుంటున్నారు అని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్న నాయుడు కామెంట్స్ చేశారు. 

19.బాంబు బెదిరింపు

 

పాతబస్తీ లోని ఐ ఎస్ సదన్ చౌరస్తాలో బాంబు ఉందంటూ పోలీసులకు ఫోన్ రావడం కలకలం రేపింది.దీనిపై సమగ్రంగా విచారణ జరిపిన పోలీసులు ఇదంతా ఉత్తిదేనని తేల్చారు.ఈ బెదిరింపు కాల్ చేసిన వ్యక్తిని పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు. 

20.ఈరోజు బంగారం ధరలు

  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 48,000   24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 52,360.

తాజా వార్తలు