న్యూస్ రౌండప్ టాప్ -20

1.గరికపాటి పై నాగబాబు కామెంట్

చిరంజీవి గరికిపాటి మధ్య వివాదం చెలరేగిన నేపథ్యంలో చిరుని స్వయంగా కలిసి క్షమాపణలు చెప్తానని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త గరికపాటి నరసింహారావు వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఆయన క్షమాపణలు ఏవీ తమకు అవసరం లేదు అంటూ చిరంజీవి సోదరుడు నాగబాబు వ్యాఖ్యానించారు.

 

2.  మునుగోడు బిజెపి అభ్యర్థిని ప్రకటించిన బిజెపి

  మునుగోడు బీజేపీ అసెంబ్లీ ఉప ఎన్నికల అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ని ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది. 

3.ఆక్వా రైతుల ఫిర్యాదు పై జగన్ సీరియస్

 

ఆక్వా రైతుల ఫిర్యాదులపై జగన్ సీరియస్ అయ్యారు.వాటి పరిష్కారం కోసం ముగ్గురు మంత్రులు , సీనియర్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేశారు. 

4.భారత్ జోడో యాత్ర

  కర్ణాటక లో కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కొనసాగుతోంది. 

5.నేడు హైదరాబాద్ కు మల్లికార్జున ఖర్గే

 

కాంగ్రెస్ అధ్యక్షుడు రేసులో ఉన్న మల్లికార్జున్ ఖర్గే నేడు గాంధీ భవన్ లో సమావేశం అయ్యారు. 

6.ఏపీ అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణ పై నేడు రౌండ్ టేబుల్ సమావేశం

ఏపీ అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణపై నేడు రౌండ్ టేబుల్ సమావేశం జరగనుంది.ఈ సందర్భంగా నిపుణుల అభిప్రాయాలను ఐక్య కార్యాచరణ కమిటీ సేకరించనుంది. 

7.నాన్ పొలిటికల్ జెఎసి ఏర్పాటు

 

Advertisement

వికేంద్రీకరణ పోరాటం కోసం నాన్ పొలిటికల్ జేఏసీ ఏర్పడింది.నేడు తొలి సమావేశం నిర్వహించి కర్యచరణ ప్రకటించనున్నారు. 

8.నేడు పలు ప్యాసింజర్ రైళ్ల రద్దు

  రైల్వే ట్రాక్ మరమ్మత్తుల కారణంగా నేటి నుంచి పలు ప్యాసింజర్ రైళ్లు రద్దు చేశారు.విజయవాడ - బిట్రుగుంట, విజయవాడ - ఒంగోలు , విజయవాడ - గూడూరు మధ్య నడిచే రైళ్లు రద్దు చేశారు. 

9.ఎస్ఆర్ఎం యూనివర్సిటీ రెండో స్నాతకోత్సవం

 

నేడు ఎస్ ఆర్ ఎం యూనివర్సిటీ రెండో స్నాతకోత్సవం జరగనుంది.  ఈ కార్యక్రమానికి ఇస్రో మాజీ చైర్మన్ డాక్టర్ కె.రాధాకృష్ణన్ హాజరుకానున్నారు. 

10.తిరుమల సమాచారం

  తిరుమల లో భక్తుల రద్దీ కొనసాగుతోంది.శ్రీ వారి దర్శనానికి 48 గంటల సమయం పడుతోంది. 

11.ఏపీలో పర్యటించనున్న తెలంగాణ మానవ హక్కుల కమిషన్

 

గుంటూరు జిల్లా పెద కాకాని తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ జి.చంద్రయ్య పర్యటించనున్నారు. 

12.బండి సంజయ్ అధ్యక్షతన సమావేశం

  నేడు బిజెపి పదాధికారులు జిల్లా అధ్యక్షులు ఇన్చార్జీలతో తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ సమావేశం నిర్వహించనున్నారు. 

13.కేటీఆర్ పై వివేక్ కామెంట్స్

 

తెలంగాణ మంత్రి కేటీఆర్ పై మాజీ ఎంపీ, బిజేపి నేత వివేక్ వెంకటస్వామి విమర్శలు చేశారు.కోల్ మైన్స్ బ్లాక్ గురించి కేటీఆర్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని వివేక్ మండిపడ్డారు,  

14.కేబుల్ బ్రిడ్జికి అరుదైన గుర్తింపు

  హైదరాబాద్ లోని దుర్గం చెరువు లో నిర్మించిన కేబుల్ బ్రిడ్జ్ కి అరుదైన గుర్తింపు లభించింది.ఇండియన్ చాఫ్టర్ ఆఫ్ అమెరికా  ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాంక్రీట్ ఆధ్వర్యంలో మౌలిక సదుపాయాల కల్పన కేటగిరీ లో రెండో స్థానంలో నిలిచింది. 

15.చిరుత పులి సంచారం

 

ఎన్టీఆర్ నాకన్నా చిన్నోడు... నన్ను మాత్రం ఒరేయ్ అని పిలుస్తాడు : రాజీవ్ కనకాల 
జాక్ మూవీ సెన్సార్ రివ్యూ.. సిద్ధు జొన్నలగడ్డ మరో బ్లాక్ బస్టర్ హిట్ సాధిస్తారా?

తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో ఉన్న అంతర్ఘాం మండలం పెద్ధం పేట లో చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది. 

16.రెండో రోజు ఈడీ విచారణకు హాజరైన జెసి

  రెండో రోజు ఏడి అధికారులు విచారణకు అనంతపురం టిడిపి కీలక నేత తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు. 

17.సుద్దాల అశోక్ తేజ కి పురస్కారం

 

Advertisement

ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ కు డాక్టర్ సీ నారాయణరెడ్డి పురస్కారం లభించింది. 

18.యాదగిరి గుట్ట లో పెరిగిన భక్తుల రద్దీ

  యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.వరుసగా సెలవలు రావడం తో పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి క్యూ కడుతున్నారు. 

19.యాదాద్రి లో తలనీలాల రుసుము పెంపు

 

యాదగిరి గుట్ట ఆలయంలో భక్తుల తలనీలాల మొక్కు టికెట్ ధరను రూ.20 నుంచి రూ.50 కి పెంచారు. 

20.ఈ రోజు బంగారం ధరలు

  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -  47,420   24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -  51,760.

తాజా వార్తలు