న్యూస్ రౌండప్ టాప్ 20

1.సీఎం జగన్ పర్యటన

ఏపీ సీఎం జగన్ నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్నారు.

సహకార సంఘ భవనాన్ని నెల్లూరు జగన్ ప్రారంభించి అనంతరం రైతు సదస్సులో పాల్గొంటారు. 

2.కేంద్ర బృందం పర్యటన

  నేడు కాకినాడలో కేంద్ర బృందం పర్యటిస్తోంది. 

3.టీటీడీ పాలకమండలి సమావేశం

 

తిరుమలలో ఈనెల 12వ తేదీన టీటీడీ పాలకమండలి సమావేశం జరగనుంది. 

4.ఆరోగ్య కేంద్రాల ప్రారంభం

  గుంటూరు బృందావన్ గార్డెన్స్ లో వైయస్సార్ పట్టణ ఆరోగ్య కేంద్రాలను మంత్రి విడుదల రజనీ ప్రారంభించనున్నారు. 

5.విద్యారంగంపైనే ప్రభుత్వం ఫోకస్

 

గత ప్రభుత్వాలు మాదిరిగా కాకుండా విద్యారంగంపైనే తాను ఎక్కువ ఫోకస్ పెట్టానని ఏపీ సీఎం జగన్ అన్నారు. 

6.ముగిసిన బీఏసీ సమావేశం

  స్పీకర్ చాంబర్ లో పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై ఏసి సమావేశం జరిగింది. 

7.సోలార్ రూప్ సైకిల్ ట్రాక్ ఏర్పాటు

 

Advertisement

ఓ ఆర్ ఆర్ పై సోలార్ గ్రూప్ సైకిల్ ట్రాక్ కు తెలంగాణ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. 

8.రామచంద్ర పిళ్లే నివాసంలో కొనసాగుతున్న సోదాలు

  ఢిల్లీ లిక్కర్ స్కాం పై ఈడి విచారణ కొనసాగుతోంది .కోకాపేటలోని రామచంద్ర పిళ్లే ఇంట్లో ఇంకా ఈ డి సోదాలు జరుగుతూనే ఉన్నాయి. 

9.అసెంబ్లీ ముట్టడికి యూత్ కాంగ్రెస్ ప్రయత్నం

 

యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నం జరిగింది.నిరుద్యోగ భృతి వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ యూత్ కాంగ్రెస్ ఆందోళనకు దిగడంతో పోలీసులు వారిని అడ్డుకునే అరెస్ట్ చేశారు. 

10.ఈటెల కామెంట్స్

  స్పీకర్ ఒక మన మనిషి లాగా వ్యవహరిస్తున్నారని బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ విమర్శించారు. 

11.రేపు బంగాళాఖాతంలో వాయుగుండం

 

రేపు బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడనుంది.దక్షిణ తెలంగాణకు భారీ వర్ష సూచన ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. 

12.నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ ,మండలి సమావేశాలు

  నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ మండల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 

13.విజిలెన్స్ కమిషనర్ పదవి కాలం పాడగింపు

 

తెలంగాణ రాష్ట్ర విజిలెన్స్ కమిషనర్ కేఆర్ నందన్ పదవీ కాలాన్ని మరో రెండు రోజులు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

14.సింగరేణి జేఏ రాత పరీక్ష కి విడుదల

 సింగరేణి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ కోసం ఆదివారం జరిగిన రాత పరీక్ష కి విడుదల చేశారు.దీనిపై అభ్యంతరాలను ఈనెల 7వ తేదీ ఉదయం 11 గంటల లోగా ఆన్లైన్ లో సమర్పించాలని సంస్థ డైరెక్టర్ తెలిపారు. 

15.తెలంగాణ రాష్ట్ర పండుగగా కాలోజీ జయంతి

 

దృఢమైన, తెల్లటి దంతాలు కోసం ఈ చిట్కాలను తప్పక పాటించండి!
పవన్ కళ్యాణ్ రాజకీయాలలో చరిత్ర సృష్టించారు.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన పరుచూరి!

ప్రజా కవి కాళోజి నారాయణరావు జయంతి సెప్టెంబర్ 9న రాష్ట్ర పండుగగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. 

16.17న చారిత్రాత్మక ఉత్సవం

  హైదరాబాద్ వేదిక గా 11 న చారిత్రాత్మక  ఉత్సవానికి శ్రీకారం చుట్టబోతున్నట్లు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. 

17.నారాయణ కామెంట్స్

 

Advertisement

బిగ్బాస్ రియాల్టీ షో కాదని , అదో దరిద్రపు బూతు షో అని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. 

18.షర్మిల కామెంట్స్

  ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నిటిని సీఎం కేసీఆర్ విస్మరించారని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. 

19. ఇంధన శాఖ ఉత్తర్వులు రద్దు చేయాలి

  భారత రాజ్యాంగం కల్పించిన హక్కులకు వ్యతిరేకంగా ఇంధన శాఖ కార్యదర్శి జారీచేసిన ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది  

20.రేషన్ షాపుల్లో ప్రధాని ఫోటో పెట్టాలి

 

కేంద్రం సబ్సిడీపై రేషన్ బియ్యం సరఫరా చేస్తున్నందున ప్రతి షాపులోనూ ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో పెట్టాల్సిందేనని కేంద్ర సహకార ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ సహాయ మంత్రి బి ఎల్ వర్మ ఆదేశించారు.

తాజా వార్తలు